TTD Darshan Tickets: వారికి నవంబర్‌ నెల కోటా టికెట్లను విడుదల చేయనున్న TTD, నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి, శ్రీశైలంలో నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి సంబంధించిన ప్రత్యేక కోటా టికెట్లు (November quota of Special darshan tokens) విడుదల కానున్నాయి. నవంబర్‌ నెల కోటాకు చెందిన టికెట్లను టీటీడీ (TTD) ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. వృద్ధులు, దివ్యాం‌గులకు సంబంధించిన ఈ టికెట్లు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తున్నది.

Tirumala

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి సంబంధించిన ప్రత్యేక కోటా టికెట్లు (November quota of Special darshan tokens) విడుదల కానున్నాయి. నవంబర్‌ నెల కోటాకు చెందిన టికెట్లను టీటీడీ (TTD) ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. వృద్ధులు, దివ్యాం‌గులకు సంబంధించిన ఈ టికెట్లు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తున్నది. పరి‌పా‌లన కార‌ణా‌లతో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికె‌ట్లను రిలీజ్‌చేస్తున్నది. డిసెంబర్‌ నెలకు వసతి గదులు కూడా బుధవారం నుంచే ఆన్‌‌లై‌న్‌లో అందు‌బా‌బులో ఉంటాయి.

శ్రీశైలం శ్రీభ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం కార్తీక మాసోత్సవాలకు సర్వాంగసుందరంగా ముస్తాబైంది. నేటి నుంచి వచ్చే నెల 23 వరకు కార్తీక ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఉత్సవాలను తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్వామివారి దర్శన వేళల్లో మార్పులు చేశారు.

శ్రీవారి దర్శనానికి 15 గంటలకు పైగా సమయం, నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్‌లు, ఈ నెల 21 నుంచి కాణిపాకం స్వయంభు వరసిద్ధుని దర్శన భాగ్యం

ప్రధాన ఆలయ ద్వారాలు ఉదయం 3.30 గంటలకు తెరువనున్నారు. తెల్లవారుజామున 4 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 11 గంటల వరకు స్వామి వారిని భక్తులు దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. శని, ఆది, సోమవారాలు, పర్వదినాల్లో స్వామివారి అలంకార దర్శన భాగ్యం కల్పిస్తామని, బుధవారం నుంచి శుక్రవారం వరకు స్పర్శ దర్శనం ఉంటుందని వెల్లడించారు. ఇక స్వామి వారి సన్నిధిలోని నాగులకట్ట ప్రాంగణం వద్ద ఈ ఏడాది భక్తులు దీపారాధనలు చేయడాన్ని అధికారులు రద్దుచేశారు. ఆలయానికి ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద ఉత్తర మాడ వీధిలో భక్తులు దీపారాధనలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement