
Tirumala, Mar 3: తిరుమల (Tirumala) జనావాసాల్లోకి చిరుతల సంచారం ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో ప్రజలంతా ఏ పక్క నుంచి ఏ ప్రమాదం వాటిల్లుతుందోనని బిక్కు బిక్కుమంటూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. తిరుమలలో మరోసారి చిరుత కలకలం (Leopard Spotted In Tirumala) రేగింది. తిరుమల అలిపిరి మార్గంలో గాలి గోపురం షాపుల దగ్గర తెల్లవారుజామున ఒంటి గంటకు చిరుత పులి కదలికలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. ఇక, వారంరోజుల కిందట తిరుపతి శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ ఆవరణలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. విశ్వవిద్యాలయ వసతి గృహాల వద్ద చిరుత సంచారంతో విద్యార్థులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
యూపీలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు... ఏపీలో బొలెరో బోల్తా.. రెండు ప్రమాదాల వివరాలు ఇవిగో..!
తిరుపతిలో చిరుత పులి కలకలం..
తిరుమల అలిపిరి మార్గంలో గాలి గోపురం షాపుల దగ్గర తెల్లవారుజామున ఒంటి గంటకు చిరుత పులి కదలికలు. pic.twitter.com/yMOOlcTmNF
— ChotaNews App (@ChotaNewsApp) March 4, 2025
మొన్నటికి మొన్న..
నెలరోజుల క్రితం జరిగిన మరో ఘటనలో అలిపిరి వేదిక్ వర్సిటీ వద్ద దాటుతున్న చిరుతను చూసి భయాందోళనకు గురై బైక్ పై వెళ్తోన్న టీటీడీ ఉద్యోగి ముని కుమార్ డివైడర్ ను ఢీకొట్టారు. వెంటనే అక్కడ ఉన్న కొంతమంది ఆ వ్యక్తిని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటనా స్ధలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. ఈ ఘటనతో అలిపిరి నుంచి జూ పార్క్ రోడ్డు వైపు ప్రయాణించే వారు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు.