Adulterated Food: దేశంలోని 25 శాతం ఆహార పదార్థాల్లో కల్తీ: ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నివేదిక
దేశంలో విక్రయిస్తున్న ఆహార పదార్థాల్లో సగటున 25శాతం వరకు కల్తీ జరుగుతున్నట్టు గుర్తించామని భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) వెల్లడించింది.
Newdelhi, Apr 30: దేశంలో విక్రయిస్తున్న ఆహార పదార్థాలు (Food Items) పెద్దయెత్తున కల్తీ (Adulterated Food) అవుతున్నాయి. మొత్తం ఆహారంలో సగటున 25శాతం వరకు కల్తీ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) వెల్లడించింది. పాలు, వంట నూనెలు, మసాలాలు, టీ పొడి, పప్పులు, ఫోర్టిఫైడ్ రైస్ తదితర పదార్థాలకు సంబంధించి గత నాలుగేండ్లలో సేకరించి విశ్లేషించిన వివిధ ఆహార పదార్థాల నాణ్యతా ఫలితాలను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తాజాగా విడుదల చేసింది. నమూనాలను విశ్లేషించేందుకు 239 ప్రయోగశాలలు, 261 మొబైల్ ల్యాబ్ లు వినియోగించారు.