Power Outage During President Address: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతుండగా 9 నిమిషాలపాటు పోయిన కరెంట్.. చీకట్లోనే ప్రసంగం.. ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో ఘటన.. వీడియో వైరల్
రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో సరిగ్గా ఉదయం 11.56 గంటల నుంచి దాదాపు 9 నిమిషాలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో యూనివర్సిటీ ఆడిటోరియంలో చీకట్లు అలముకున్నాయి. అయినప్పటికీ తన ప్రసంగాన్ని ద్రౌపది ఆపలేదు.
Bhubaneswar, May 7: ఒడిశాలో (Odisha) మూర్‌భంజ్ జిల్లా బరిపదలోని మహారాజ శ్రీరామచంద్ర భంజదేవ్ వర్సిటీలో నిన్న స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రప్రతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రప్రతి ప్రసంగిస్తుండగా అనుకోని ఘటన చోటుచేసుకున్నది. దీంతో అందరూ షాక్ కి గురయ్యారు. అసలేమైందంటే.. రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో సరిగ్గా ఉదయం 11.56 గంటల నుంచి దాదాపు 9 నిమిషాలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో యూనివర్సిటీ ఆడిటోరియంలో చీకట్లు అలముకున్నాయి. అయినప్పటికీ తన ప్రసంగాన్ని ద్రౌపది ఆపలేదు.
చీకటి, వెలుగులను సమానంగా చూడాలని
పోడియం నుంచి వస్తున్న వెలుతురు మధ్య రాష్ట్రపతి తన ప్రసంగాన్ని కొనసాగించారు. చీకటి, వెలుగులను సమానంగా చూడాలనే విషయాన్ని ఈ ఘటన నుంచి మనం నేర్చుకోవాలని పేర్కొంటూ తన ప్రసంగాన్ని కొనసాగించి పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.