Airtel New Plan: ఎయిర్‌టెల్ నుంచి నయా ప్లాన్, రూ.279 రీఛార్జ్‌తో 45 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా..

45 రోజుల వ్యాలిడిటీతో రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. మొత్తం 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, మొత్తం 600 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.

airtel

దేశీయ టెలికం దిగ్గజ ఆపరేటర్ ‘భారతీ ఎయిర్‌టెల్’ తమ వినియోగదారుల కోసం మరో నూతన ప్లాన్‌ను ఆవిష్కరించింది. 45 రోజుల వ్యాలిడిటీతో రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. మొత్తం 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, మొత్తం 600 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. మొత్తంగా చూస్తే ఈ ప్లాన్‌పై యూజర్‌ రోజుకు కేవలం రూ.6.2 మాత్రమే వెచ్చిస్తారు. అయితే డేటా పరిమితంగా ఉంటుంది. 2జీబీ కంటే ఎక్కువ డేటా కావాలనుకుంటే రోజుకి రూ.19తో  ‘యాడ్ ఆన్ డేటా’ వోచర్‌లను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక ఈ ప్లాన్‌లో భాగంగా అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలో ట్యూన్‌లు, వింక్ మ్యూజిక్ వంటి ఎయిర్‌టెల్ అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. ఎక్కువ డేటా అవసరం లేకుండా.. తక్కువ ఖర్చుతో సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచాలనుకునే యూజర్లకు ఈ ప్లాన్ అనుకూలం. అపరిమిత వాయిస్ కాలింగ్ అందిస్తుండడం ఈ ప్లాన్‌లో చాలా విలువైన జోడింపుగా ఉంది. దేశ వ్యాప్తంగా జియో సేవలు డౌన్, ఎక్స్ వేదికగా గగ్గోలు పెడుతున్న వినియోగదారులు

ఎయిర్‌టెల్ కంపెనీ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లలో ఈ రీఛార్జ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ తక్కువ ధరకు ఎక్కువ కాలం వ్యాలిడిటీని అందిస్తున్న ఆఫర్‌గా ఉంది. కాగా ఇటీవలే ఎయిర్‌టెల్  70 రోజుల వ్యాలిడిటీతో రూ.395 ప్లాన్‌ను ప్రకటించింది. వ్యాలిడిటీ ఎక్కువగానే ఉన్నప్పటికీ ఈ ప్లాన్ కింద కూడా డేటా పరిమితంగానే ఉంది. డేటా ఎక్కువగా వాడేవారికి ఈ ప్లాన్లు అంత ఆకర్షణీయంగా కనిపించకపోవచ్చు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..