Army Dog Zoom: ఉగ్రమూకలకు చుక్కలు చూపించిన ఆర్మీ జాగిలం జూమ్.. శరీరంలోకి తూటాలు దూసుకుపోయినా పట్టు వదలకుండా టాస్క్ పూర్తి.. అనంతరం కుప్పకూలిపోయిన జూమ్.. వెంటనే హాస్పిటల్ కి తరలింపు.. జూమ్ కోలుకోవాలని ఆర్మీ ప్రత్యేక ట్వీట్..
ఆర్మీ శిక్షణ పొందిన జూమ్ చాలా క్రూరమైనది. ఉగ్రవాదుల జాడ పసికట్టడంలో దిట్ట. ఉగ్రవాదుల ఇంటి లోకి చొరబడగానే రెండు తుపాకీ తూటాలు తగిలి తీవ్రంగా గాయపడింది. అయినా ఆ జాగిలం అంతటితో ఆగక, ఉగ్రవాదులను ఎదిరించింది.
Srinagar, October 11: అనంతనాగ్ జిల్లాలో సోమవారం ఆర్మీ బలగాలకు , ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో (Encounter) ఆర్మీకి చెందిన జూమ్ (Zoom) అనే పేరుగల జాగిలం (Army Dog) తీవ్రంగా గాయపడింది. ఉగ్రవాదులు స్థావరంగా ఉన్న ఒక ఇంటి లోకి బలగాలు సోమవారం తమ జాగిలాన్ని పంపారు. ఆర్మీ శిక్షణ పొందిన ఈ జాగిలం జూమ్ చాలా క్రూరమైనది. ఉగ్రవాదుల జాడ పసికట్టడంలో దిట్ట. ఉగ్రవాదుల ఇంటి లోకి చొరబడగానే రెండు తుపాకీ తూటాలు తగిలి తీవ్రంగా గాయపడింది. అయినా ఆ జాగిలం అంతటితో ఆగక, ఉగ్రవాదులను ఎదిరించింది.
జూమ్ తన టాస్క్ కచ్చితంగా నెరవేర్చడం వల్లనే ఉగ్రవాదులను తాము మట్టుపెట్టగలిగామని అధికారులు తెలిపారు. గాయపడిన జూమ్‌ను వెంటనే ఆర్మీ వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. జూమ్ త్వరగా కోలుకోవాలని ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది.
Advertisement
సంబంధిత వార్తలు
Sudan Military Plane Crash: ఘోర విమాన ప్రమాదంలో 46కు పెరిగిన మృతుల సంఖ్య, గాల్లోకి ఎగిరిన కాసేపటికే కుప్పకూలిన సూడాన్ ఆర్మీ ఫ్లైట్
Srisailam Tunnel Collapse:ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర సహాయక చర్యలు ముమ్మరం, రంగంలోకి సైన్యానికి చెందిన స్పెషల్ బృందం
Kerala: రష్యా ఆర్మీలోకి వెళ్లి మరణించిన కేరళ వ్యక్తి, కారకులైన ముగ్గురిని అరెస్ట్‌చేసిన పోలీసులు, ఇంతకీ వాళ్లు ఏం చేశారంటే?
Poonch Road Accident: 350 అడుగుల లోయలో పడిన ఆర్మీ వాహనం, 5 మంది సైనికులు మృతి, పలువురు సైనికులకు తీవ్ర గాయాలు, పూంచ్ జిల్లాలో విషాదకర ఘటన
Advertisement
Advertisement
Advertisement