Article 370 Abrogation 5th Anniversary: ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు పూర్తి, బీజేపీ ఏకాత్మ మహోత్సవ్‌ ర్యాలీ,జమ్మూకశ్మీర్‌లో హై అలర్ట్‌, అమర్‌నాథ్ యాత్రను నిలిపివేత

ఈ నేపథ్యంలో బీజేపీ ఇవాళ ‘ఏకాత్మ మహోత్సవ్‌’ ర్యాలీని నిర్వహిస్తుండగా.. కాంగ్రెస్‌, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ సహా ప్రతిపక్ష కూటమి ఆగస్టు 5ను బ్లాక్‌ డేగా పేర్కొంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు రెడీ అయింది

Jammu Kashmir encounter One Pakistani person has been killed

Jammu. August 5: జమ్మూ కశ్మీర్‌కు (Jammu and Kashmir) ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370 (Article 370)ని రద్దు చేసి నేటికి ఐదేళ్లు పూరయ్యాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఇవాళ ‘ఏకాత్మ మహోత్సవ్‌’ ర్యాలీని నిర్వహిస్తుండగా.. కాంగ్రెస్‌, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ సహా ప్రతిపక్ష కూటమి ఆగస్టు 5ను బ్లాక్‌ డేగా పేర్కొంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం అత్యంత అప్రమత్తతో వ్యవహరిస్తోంది. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఇటీవలి వరుస ఉగ్రఘటనల నేపథ్యంలో భద్రతాబలగాలను హై అలర్ట్‌లో ఉంచింది. అలాగే సైనిక సిబ్బందిని తరలించే కాన్వాయ్‌ల రాకపోకలను నిలిపివేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. జవాన్ల కాన్వాయ్‌లపై దాడి జరిగేందుకు అవకాశం ఉందన్న నిఘావర్గాల సమాచారం మేరకు వాటి రాకపోకలపై కఠిన ఆంక్షలు విధించామని సంబంధిత అధికారులు తెలిపారు.  కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేం, ఆర్టికల్ 370పై కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు, జమ్మూ కాశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం

అమర్‌నాథ్ యాత్ర వాహనాలపై కూడా ఇవే ఆంక్షలున్నాయని తెలిపారు. అమర్‌నాథ్ యాత్ర ముందుజాగ్రత్త చర్యగా ఒకరోజు నిలిపివేశారు. “ముందుజాగ్రత్త చర్యగా ఈ రోజు యాత్రను నిలిపివేశారు. జమ్మూ నుండి కాశ్మీర్‌కు ఈరోజు కొత్త బ్యాచ్‌ను అనుమతించలేదు, ”అని ఒక అధికారి తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు, 3,880 మీటర్ల ఎత్తైన గుహ మందిరాన్ని 490,000 మంది యాత్రికులు సందర్శించారు.

జమ్ములో దాడి ముప్పు పొంచి ఉన్నందున బలగాలు ఒంటరిగా ఉండొద్దని హెచ్చరించారు. అలాగే ఇప్పటికే అదనపు భద్రతా సిబ్బందిని ఆ ప్రాంతానికి తరలించారు. తొలిసారి అస్సాం రైఫిల్స్‌ను ఈ ప్రాంతంలో మోహరించారు. చొరబాట్లు, అనుమానాస్పద కదలికలను పర్యవేక్షించేందుకు సరిహద్దుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ ఉదయం నియంత్రణ రేఖ సమీపంలోని అఖ్నూర్‌, సుందర్‌బనీ సెక్టార్ల వద్ద అనుమానాస్పద కదలికలను గుర్తించడంతో ఆర్మీ వార్నింగ్‌ షాట్స్‌ను పేల్చింది. ఆ ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపడుతోంది. జమ్మూ & కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించడంపై కీలక వ్యాఖ్యలు చేసిన హోం మంత్రి అమిత్ షా, 1950 నుండి అది మా ఎజెండాలో ఉందని వెల్లడి

జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ని 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం జమ్మూ- కశ్మీర్ ను రెండు కేంద్రపాలిత (జమ్మూ-కశ్మీర్, లడఖ్) ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని జమ్మూ కశ్మీర్‌కు చెందిన పలు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగబద్దమే అని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆర్టికల్‌ తాత్కాలిక ఏర్పాటు మాత్రమే గానీ, శాశ్వతం కాదని తేల్చి చెప్పింది. జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif