Asia Cup 2022 Winner Prediction: కచ్చితంగా భారత జట్టు ట్రోఫీ గెలవగలదు.. తేల్చి చెప్పిన పాక్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ బట్‌

తేల్చి చెప్పిన పాక్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ బట్‌

Asia Cup 2022 Winner Prediction: ఆసియా కప్‌-2022 (Asia Cup) ట్రోఫీ సాధించగల సత్తా టీమిండియాకు ఉన్నదని పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ బట్‌ పేర్కొన్నాడు. కచ్చితంగా భారత్‌ ఈ ట్రోఫీ గెలవగలదన్న అతడు.. టీమిండియా జట్టు ఆటగాళ్లకు విటమిన్లు తక్కువయ్యాయా అంటూ చమత్కరించాడు. కష్టపడితే, పాక్ ఇండియాకు గట్టి పోటీ ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డాడు. ఇదే సమయంలో టీమిండియా (Team India) బెంచ్‌ పటిష్టంగా ఉందని కితాబు ఇచ్చాడు.

ధోనీ రిటైర్మెంట్ రెండో వార్షికోత్సవ సందర్భంగా ఐసీసీ స్పెషల్‌ వీడియో.. చూశారా?

సల్మాన్ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. కాగా ఆసియా కప్‌-2022లో భాగంగా ఆగష్టు 28న భారత్‌- పాకిస్తాన్‌ (India Vs Pakistan) మధ్య మ్యాచ్‌ జరుగనుంది. టీ20 ప్రపంచకప్‌-2021లో పాక్‌ చేతిలో ఎదురైన ఘోర ఓటమికి బదులు తీర్చుకోవాలని రోహిత్‌ సేన పట్టుదలగా ఉంది.