Bihar: ఇదేమి దారుణం, వైద్యం చేయాలంటూ పిలిచి కూతురితో పెళ్లి చేశారు, లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కు పరిగెత్తిన డాక్టర్, కొడుకు కనిపించడం లేదంటూ మిస్సింగ్‌ కేసు నమోదు

అత్యవసరం అనుకుని హుటాహుటినా సదరు గ్రామానికి ఆ డాక్టర్‌ వెళ్లాడు. అయితే.. మార్గంమధ్యలోనే డాక్టర్‌ను ఎత్తుకెళ్లి (Bihar veterinarian Kidnapped) బలవంతంగా వాళ్ల ఇంట్లో అమ్మాయికి ఇచ్చి పెళ్లి (Forcibly Married) చేసేశారు.

Marriage| Representational Image (Photo Credits: unsplash)

Patna, June 15: బిహార్‌ బెగుసురాయ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ కుటుంబం.. పశువుకి వైద్యం చేసే నిమిత్తం ఇంటికి రావాలంటూ ఓ వైద్యుడిని బతిమాలింది. అత్యవసరం అనుకుని హుటాహుటినా సదరు గ్రామానికి ఆ డాక్టర్‌ వెళ్లాడు. అయితే.. మార్గంమధ్యలోనే డాక్టర్‌ను ఎత్తుకెళ్లి (Bihar veterinarian Kidnapped) బలవంతంగా వాళ్ల ఇంట్లో అమ్మాయికి ఇచ్చి పెళ్లి (Forcibly Married) చేసేశారు. ఈ విషయంలో ఆ డాక్టర్‌ ఇంట్లో తెలిసి.. షాక్‌ తిన్నారు. ఈ మేరకు ఆ వెటర్నరీ డాక్టర్‌ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అంతేకాదు తన కొడుకు కనిపించడం లేదంటూ మిస్సింగ్‌ కేసు నమోదు చేయించారాయన. ఇదిలా ఉంటే.. బెగుసురాయ్ ఎస్పీ యోగేంద్ర కుమార్ ఈ ఘటనపై సాదాసీదాగా స్పందించారు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో.. తమ ఇంటి బిడ్డల కోసం పెళ్లి కాని అబ్బాయిలను కిడ్నాప్‌ చేసి బలవంతంగా పెళ్లి చేస్తారట. అక్కడ ఇది చాలా సర్వసాధారణమని వ్యవహారమని చెప్పారాయన. దీన్ని అక్కడ వరుడి కిడ్నాప్‌ లేదా పకడ్వా వివాహం అని పిలుస్తారని వెల్లడించారు. అయితే ఇలాంటి ఘటనల్లో బాధితులు గనుక పోలీసులను ఆశ్రయిస్తే మాత్రం చర్యలు తీసుకుంటారట. ఇదిలా ఉండగా.. ప్రస్తుత ఘటనపై సత్వరమే విచారణ జరపడమే కాకుండా నిందితుల పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.

భార్య లేదని ప్రియురాలితో రూంలో నగ్నంగా.., సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన భార్య, కోపం పట్టలేక ఇద్దరినీ బట్టల్లేకుండా రోడ్ల మీదకు ఈడ్చుకువచ్చింది, ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్ జిల్లాలో ఘటన

మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఏదో జంతువుకు ఒంట్లో బాగలేదని కాల్ (Called To Check On Sick Animal) వచ్చింది. అక్కడికి వెళ్లిన తర్వాత అతన్ని ముగ్గురు వచ్చి కిడ్నాప్ చేశారు. తను తిరిగి రాకపోవడంతో ఇంట్లో అందరం చాలా టెన్షన్ పడిపోయి పోలీసులను ఆశ్రయించాం’’ అని సదరు డాక్టర్ బంధువులు చెప్తున్నారు.ఇటీవల ఇలాగే బలవంతంగా పెళ్లి చేస్తుంటే.. వరుడి దుస్తుల్లో ఉన్న యువకుడు ఏడ్చి గగ్గోలు పెడుతూ, తనను వదిలేయమని ప్రాధేయపడుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement