BSNL Data Breach: బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్ల డేటా లీక్, 5000 డాలర్లకు అమ్మకానికి పెట్టిన హ్యాకర్, కస్టమర్ల డేటా హ్యాక్ అవ్వడం ఇది రెండోసారి
గతేడాది డిసెంబరులో ఇలానే బీఎస్‌ఎన్‌ఎల్ ఫైబర్, ల్యాండ్‌లైన్ యూజర్ల డేటా బయటకు పొక్కిన సంగతి విదితమే.
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) వినియోగదారుల వ్యక్తిగత డేటా లీకైంది.కాగా గత ఆరు నెలల్లో కస్టమర్ల డేటా హ్యాక్ అవ్వడం ఇది రెండోసారి. గతేడాది డిసెంబరులో ఇలానే బీఎస్‌ఎన్‌ఎల్ ఫైబర్, ల్యాండ్‌లైన్ యూజర్ల డేటా బయటకు పొక్కిన సంగతి విదితమే. తాజాగా లీక్ అయిన డేటాలో సిమ్ కార్డ్ వివరాలు, అంతర్జాతీయ మొబైల్ చందాదారుల గుర్తింపు (IMSI), హోమ్ లొకేషన్.. వంటి సమాచారం ఉన్నట్లు అథెంటియన్ టెక్నాలజీస్ పేర్కొంది. ఈ 35 రకాల స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్ బంద్, మీ మొబైల్ ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి
బీఎస్‌ఎన్ఎల్‌కు చెందిన 278 జీబీ డేటా ఉందంటూ కిబర్ ఫాంటోమ్ అనే వ్యక్తి 5000 డాలర్లకు అమ్మకానికి పెట్టినట్లు అథెంటియన్ టెక్నాలజీస్ తన నివేదికలో పేర్కొంది. నకిలీ సిమ్ కార్డ్‌లను సృష్టించడానికి ఈ డేటా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ వివరాలను ఉపయోగించి యూజర్ల వ్యక్తిగత ఖాతాలను నేరగాళ్లు అనధికారికంగా యాక్సెస్ చేయడం, సైబర్ దాడులు, మోసాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.