Bengal Shocker: ఐఫోన్ కొనేందుకు కన్నబిడ్డనే అమ్మేసిన తల్లిదండ్రులు.. ఇన్‌స్టాలో రీల్స్ చేసేందుకే.. బెంగాల్‌లో వెలుగు చూసిన ఘటన

ఇన్‌ స్టాలో రీల్స్ పెట్టి సోషల్ మీడియాలో పాప్యులర్ కావాలనుకున్న భార్యభర్తలు దారుణానికి తెగబడ్డారు. వీడియోలు రికార్డు చేసేందుకు ఐఫోన్ కొనాలనుకున్న వారు ఏకంగా కన్నబిడ్డనే అమ్మేశారు. పశ్చిమబెంగాల్‌లో ఈ దారుణం వెలుగు చూసింది.

Born Baby (Credits: Twitter)

Newdelhi, July 28: ఇన్‌ స్టాలో (Insta) రీల్స్ (Reels) పెట్టి సోషల్ మీడియాలో (Social Media) పాప్యులర్ కావాలనుకున్న భార్యభర్తలు దారుణానికి తెగబడ్డారు. వీడియోలు (Video) రికార్డు చేసేందుకు ఐఫోన్ కొనాలనుకున్న వారు ఏకంగా కన్నబిడ్డనే అమ్మేశారు. పశ్చిమబెంగాల్‌లో ఈ దారుణం వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, ఉత్తర 24 పరగణాల జిల్లా పానిహతిలోని గాంధీనగర్‌కు చెందిన జయదేవ్, సాథీ దంపతులకు ఏడేళ్ల కుమార్తె, 8 నెలల కుమారుడు ఉన్నారు. ఇటీవల కాలంలో వారు వివిధ ప్రాంతాలకు వెళుతూ ఇన్‌ స్టాలో రీల్స్ చేస్తున్నారు.

UP Horror: నిద్రిస్తుండగా భర్తను మంచానికి కట్టేసి గొడ్డలితో నరికి చంపిన భార్య.. ఐదు ముక్కలుగా చేసి కాలువలో విసిరేసిన వైనం.. శరీర భాగాల కోసం కాల్వలో గాలిస్తున్న పోలీసులు

అలా అనుమానం..

అయితే వారి పక్కన ఉండాల్సిన పసికందు జాడ కనిపించకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. బిడ్డ ఏమైందని వారిని ప్రశ్నించగా అమ్మేశామంటూ ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా చెప్పేశారు. ఆ డబ్బుతో ఐఫోన్ కొనుగోలు చేసి దాంతో ఇన్‌స్టా రీల్స్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. దీంతో, షాకయిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఆ జంటను అదుపులోకి తీసుకున్నారు.

Kerala Lottery: అదృష్టం అంటే ఇదేగా.. 11 మంది మహిళలు కలిసి రూ.250 పోగేసి లాటరీ టిక్కెట్ కొనుగోలు.. దానికే తగిలిన రూ.10 కోట్లు.. తమ ఆర్థిక కష్టాలు తీరుతాయని మహిళల హర్షం.. కేరళలో ఘటన

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement