Pilibhit, July 28: ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) లో ఘోరం జరిగింది. కట్టుకున్న భర్తను ఓ మహిళ గొడ్డలితో నరికేసింది. ఆపై మృతదేహాన్ని ఐదు ముక్కలుగా చేసి కాల్వలో (Canal) పడేసింది. ఇప్పుడు ఆ శరీర భాగాల కోసం పోలీసులు (Police) గాలింపులు మొదలెట్టారు. పిలిభిత్ (Pilibhit) లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. గుజ్రాలా ప్రాంతంలోని శివనగర్ కు చెందిన 55 ఏళ్ల రాంపాల్ భార్య దులారో దేవి కొన్ని రోజులుగా భర్త మిత్రుడితో సన్నిహితంగా కలిసి ఉంటోంది. నెల రోజుల క్రితం ఆమె తిరిగి గ్రామానికి చేరుకుంది. ఆ తర్వాత భర్త కనిపించడం లేదంటూ సమీపంలోనే భార్యాపిల్లలో కలిసి నివసిస్తున్న కుమారుడికి చెప్పింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Woman in Uttar Pradesh kills husband while he was sleeping, cuts his body into 5 pieces with an axe, throws into nearby canal.
Details. #UttarPradesh #UP #CrimeNews https://t.co/EgyHIHKK0f
— Vani Mehrotra (@vani_mehrotra) July 28, 2023
విచారించగా నిజాలు..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దులారో దేవి ప్రవర్తనను అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ జరుపగా ఆమె అసలు విషయాలు చెప్పింది. అది విని పోలీసులు షాకయ్యారు. భర్తను తానే చంపేసినట్టు దులారో దేవి అంగీకరించింది. ఆదివారం రాత్రి భర్త నిద్రపోయిన తర్వాత మంచానికి కట్టేసి గొడ్డలితో నరికి చంపానని, ఆ తర్వాత ఐదు ముక్కలుగా కోసి సమీపంలోని కాలువలో పడేసినట్టు తెలిపింది. దీంతో అతడి శరీర భాగాల కోసం పోలీసులు ఈతగాళ్ల సాయంతో కాలువలో గాలిస్తున్నారు. అక్రమ సంబంధమే హత్యకు కారణంగా తెలుస్తుంది.