Vinod Kambli Viral Video: ఓ సచిన్.. నీ స్నేహితుడిని చూశావా, నడవలేని స్థితిలో వినోద్ కాంబ్లీ వీడియో వైరల్, సాయం చేయాలంటూ టెండూల్కర్‌కి ట్యాగ్ చేస్తున్న అభిమానులు
వైరల్ అవుతున్న ఆ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియోలో 52 ఏళ్ల కాంబ్లీ నడవలేని స్థితిలో కనిపించాడు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్క్‌ర్ చిన్ననాటి స్నేహితుడు, 90వ దశకంలో టీమిండియా స్టార్ బ్యాటర్‌గా వెలుగొందిన భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియోలో 52 ఏళ్ల కాంబ్లీ నడవలేని స్థితిలో కనిపించాడు.
ఏదో పని మీద బయటికొచ్చిన అతడు ఓ షాప్ ముందు ఉన్న బైక్‌ని పట్టుకుని నిల్చున్నాడు. ఆ షాప్‌లోకి వెళ్లడానికి కాంబ్లీ ప్రయత్నించినా సరిగ్గా నడవలేక ఇబ్బందిపడ్డాడు. దీనిని గమనించిన స్థానికులు అతడి చేతులు పట్టుకుని నెమ్మదిగా షాప్‌లో కూర్చోబెట్టారు. పక్కన ఇద్దరు మనుషులు పట్టుకుని అతడిని నడిపించుకుని తీసుకెళ్లారు. అతడు 2013లో తీవ్ర గుండెపోటుకు గురయ్యాడు. ఆ సమస్య నుంచి కాస్త కోలుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అతడి పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదని తాజా వీడియో రుజువు చేస్తోంది. క్యాన్సర్‌తో పోరాడి ఓడిన టీమిండియా లెజెండరీ అన్షుమాన్ గైక్వాడ్,ఆటగాడిగా,కోచ్‌గా,సెలక్టర్‌గా రికార్డ్స్ ఇవే
అయితే, ఈ వీడియో ఇప్పటిదా? పాతదా అనే దానిపై స్పష్టత లేదు. వినోద్ కాంబ్లీ కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆర్థికంగానూ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. బీసీసీఐ ఇచ్చే పింఛనుతోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నట్లు కాంబ్లీ గతంలో పేర్కొన్నాడు. వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో అతడి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar).. తన మిత్రుడు అయిన కాంబ్లీకి సహాయం చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Here's Videos
తడు మద్యం సేవించి ఉన్నాడేమో అని కొందరు కామెంట్లు చేశారు. అతడి దీన స్థితి చూసి మరికొందరు జాలి కురిపించారు. అతడిని ఆదుకోవాలని కొందరు బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. వినోద్ కాంబ్లీ 1993-2000 మధ్య టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. అనంతరం క్రికెట్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నాడు. కాగా సచిన్, కాంబ్లీ మంచి స్నేహితులు.
1988లో పాఠశాల స్థాయి క్రికెట్‌లో సచిన్-కాంబ్లీ జోడీ సృష్టించిన ప్రభంజనం ఎవ్వరూ మరచిపోలేరు. హారిస్ షీల్డ్ సెమీఫైనల్ మ్యాచ్‌లో వీరిద్దరూ కలిసి 664 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అందులో కాంబ్లి 349*, సచిన్ 326* పరుగులు చేశారు. 1990ల్లో అంతర్జాతీయ క్రికెట్‌లోనూ కాంబ్లీ ఆరంభంలో ఓ వెలుగు వెలిగాడు. తొమ్మిది సంవత్సరాల పాటు ఈ లెఫ్ట్ హ్యాండర్ నిలకడగా రాణించాడు. 1990 దశకంలో దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌లో తన మార్కు చూపించాడు. 1993లో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన టెస్టులో ఏకంగా రెండు సెంచరీలు చేశాడు. 1993లో ఇంగ్లాండ్‌పై భారత్ చరిత్రాత్మక టెస్టు సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. టెస్టు, వన్డేల్లో కలిపి 10 వేలకు పైగా పరుగులు చేశాడు వినోద్ కాంబ్లీ.
వినోద్ కాంబ్లీ భారత్ తరపున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. 1991లో షార్జాలో పాకిస్థాన్ జట్టుతో జరిగిన వన్డేలో అతను అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. మొత్తం 121 మ్యాచ్ లు ఆడిన అతను 3,561 పరుగులు చేశాడు.