Happy Janmashtami: శ్రీకృష్ణ జన్మాష్టమి స్పెషల్.. సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ వేసిన ఈ అద్భుత కళాఖండం అదరహో..!
దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. కృష్ణాష్టమి సందర్భంగా సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఓ అద్భుతమైన కళాఖండానికి ప్రాణం పోశారు.
Hyderabad, Aug 26: నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి (Happy Janmashtami). దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. కృష్ణాష్టమి సందర్భంగా సైకత శిల్పి (Sand Art) సుదర్శన్ పట్నాయక్ (Sudarshan Patnaik) ఓ అద్భుతమైన కళాఖండానికి ప్రాణం పోశారు. ఒడిశాలోని పూరీ బీచ్ లో 'కిల్ ద ఈవిల్' అనే సందేశంతో ఆయన శ్రీకృష్ణుడి సైకత శిల్పాన్ని తీర్చిద్దారు. ఎంతో అద్భుతంగా ఉన్న ఈ శిల్పం బీచ్ కు వచ్చేవారిని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీచ్ లోని ఇసుకతో తీర్చిదిద్దే తన అద్భుతమైన కళాఖండాలతో సుదర్శన్ పట్నాయక్ అందరినీ అబ్బురపరుస్తుంటారన్న విషయం తెలిసిందే.
ఇదేందయ్యా.. ఇది..? హెల్మెట్ పెట్టుకోలేదని కారు డ్రైవర్ కు జరిమానానా? నోయిడా పోలీసుల వింత నిర్ణయం
Here's Video
శ్రీ కృష్ణ జన్మాష్టమికి మరో పేరు
హిందువులు పవిత్రంగా జరుపుకునే పండగలలో శ్రీ కృష్ణ జన్మాష్టమి ఒకటి. ఈ పర్వదినాన్నే "కృష్ణాష్టమి", "గోకులాష్టమి" ఇంకా.. "అష్టమి రోహిణి" అని కూడా అంటారు. ప్రతీ సంవత్సరం శ్రావణ మాసం కృష్ణ పక్షంలోని అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటారు. అయితే, పురాణాల ప్రకారం.. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు. కాబట్టి, ఈ ఏడాది ఆగష్టు 26న తేదీన అంటే నేడు కన్నయ్యను పూజించుకోవాలని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.