Shakaboom Dance: కోహ్లీ, పాండ్యా ‘షకబూమ్’ డ్యాన్స్ చూశారా.. వీడియో ఇదిగో!

ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో పోస్ట్ చేసిన హార్దిక్.. ఇద్దరి సరదా స్టెప్పులు చూసి నవ్వుకుంటున్న ఫ్యాన్స్

Kohli, Pandya Dance (Photo Credits: Twitter)

NewDelhi, September 19: టీమిండియా క్రికెటర్లు (Team India) విరాట్ కోహ్లీ (Virat Kohli), హార్దిక్ పాండ్యా (Hardik pandya) అద్భుతమైన ఆటగాళ్లే కాదు మంచి స్నేహితులు కూడా. మైదానంలో కలిసికట్టుగా ఆడుతూ జట్టును గెలిపించే వీళ్లు బయట చాలా సరదాగా ఉంటారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ రీల్ సోషల్ మీడియాలో (Social Media) హల్ చేస్తోంది. టిక్ టాక్ లో వైరల్ అవుతున్న ‘షకబూమ్’ పాటకు ఈ ఇద్దరూ కలిసి కాళ్లు కదిపారు.

బౌలర్ చింతన్ గజా త్రో.. టీమిండియా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్‌‌కు తప్పిన పెను ప్రమాదం

షార్ట్స్ ధరించిన పాండ్యా, కోహ్లీ నల్ల కళ్లజోడు పెట్టుకొని కో ఆర్టినేషన్ తో  స్టెప్పులు వేశారు. ఈ వీడియోను హార్దిక్ పాండ్యా తన ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. అంతే.. క్షణాల్లో వైరల్ అయ్యింది. కోహ్లీ, పాండ్యా ఫన్నీ స్టెప్పులు నవ్వులు పూయిస్తోంది.