Poonch Attack: పూంచ్ దాడి మా పనే.. ప్రకటించిన జైషే మహ్మద్.. ఉగ్రదాడిలో అసువులు బాసిన ఐదుగురు జవాన్లు.. గ్రనేడి దాడి కారణంగానే వాహనంలో మంటలు.. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో జల్లెడ పడుతున్న అధికారులు

దీంతో భారత్ అప్రమత్తమైంది.

Poonch Attack (Credits: Twitter)

Newdelhi, April 21: జమ్మూకశ్మీర్‌లోని (Jammu And Kashmir) పూంచ్ (Poonch) జిల్లాలో ఆర్మీ జవాన్లు (Jawans) ఉన్న వాహనంపై నిన్న జరిగిన ఉగ్రదాడి తమ పనేనని పాక్ (Pakistan) ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (Jaish-e-Mohammed) ప్రకటించింది. దీంతో భారత్ అప్రమత్తమైంది. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదులను వెదికేందుకు ఆ ప్రాంతాన్ని మిలిటరీ జల్లెడ పడుతున్నది. కాగా ఈ ఉగ్రదాడిలో ఐదుగురు భారత జవాన్లు అసువులు బాశారు. జిల్లాలోని భీంబెర్ గాలి నుంచి సంగియోట్ వెళ్తున్న ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులతో తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులు కాగా, ఓ అధికారి గాయపడ్డారు. వెంటనే ఆయనను రాజౌరీలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (జమ్ము) సహా సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Army Vehicle Fire: భారత ఆర్మీ వాహనంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం, నలుగురు జవాన్లు సజీవ దహనం అయినట్లుగా వార్తలు, జమ్మూకాశ్మీర్‌లో విషాద ఘటన

అలా దాడి జరుగొచ్చు

పూంచ్ జిల్లాలోని రాజౌరి సెక్టార్‌లో నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ ఉగ్రదాడి జరిగింది. కాల్పులు జరిగిన వెంటనే వాహనంలో మంటలు చెలరేగాయి. గ్రనేడ్ దాడి కారణంగా మంటలు అంటుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Same-Sex Marriage: పెళ్లి చేసుకోవాలంటే మగ, ఆడ అవసరమా, శారీరక సంబంధం కోసమే పెళ్లి చేసుకుంటారా, న్యాయవాదులను ప్రశ్నించిన సీజేఐ డివై చంద్రచూడ్