James Anderson Retires: క్రికెట్ చరిత్రలో ముగిసిన యోధుడి ప్రస్థానం, టెస్ట్ కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికిన జేమ్స్ అండర్సన్, ఎమోషనల్ అయిన ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్
వెస్టిండీస్‌తో ఇవాళ (జులై 12) ముగిసిన టెస్ట్ మ్యాచ్ ఆండర్సన్ కెరీర్‌లో చివరిది. తన చివరి మ్యాచ్‌ను జిమ్మీ గెలుపుతో ముగించాడు. ఈ మ్యాచ్‌లో అతను నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అనంతరం గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు.
ఇంగ్లండ్ ప్లేయర్ జేమ్స్ అండర్సన్ తన 22 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికాడు. వెస్టిండీస్‌తో ఇవాళ (జులై 12) ముగిసిన టెస్ట్ మ్యాచ్ ఆండర్సన్ కెరీర్‌లో చివరిది. తన చివరి మ్యాచ్‌ను జిమ్మీ గెలుపుతో ముగించాడు. ఈ మ్యాచ్‌లో అతను నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అనంతరం గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు.
సుదీర్ఘ కెరీర్‌లో మూడు ఫార్మాట్లలో 401 మ్యాచ్‌లు ఆడిన అండర్సన్ 991 వికెట్లు పడగొట్టాడు. అయితే వీటిలో అత్యధికం టెస్టుల్లో వచ్చినవే. రెడ్ బాల్ క్రికెట్‌లో 704, వన్డేల్లో 269, టీ20ల్లో 18 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. దాంతో, ‘హ్యాపీ రిటైర్మెంట్’, ‘థ్యాంక్యూ అండర్సన్’ హ్యాష్‌ట్యాగ్‌లు వైరల్ అవుతున్నాయి. భారత్–పాక్ మ్యాచ్‌లకు దుబాయ్ లేదా శ్రీలంక అయితే ఒకే, చాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా దాయాది దేశంలో కాలుపెట్టదని బీసీసీఐ స్పష్టం
ఈ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ తన టెస్టు కెరీర్ లో అత్యధిక వికెట్లు భారత్ పైనే పడగొట్టాడు. ఆండర్సన్ భారత్ తో 39 టెస్టుల్లో 149 వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాపై 39 టెస్టుల్లో 117 వికెట్లు సాధించాడు. ఆండర్సన్ 194 వన్డేల్లో 269 వికెట్లు, 19 అంతర్జాతీయ టీ20 పోటీల్లో 18 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ లో ఒకే ఒక్క అర్థం సెంచరీ సాధించాడు. అది కూడా టెస్టుల్లో. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 297 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన ఆండర్సన్ 1,122 వికెట్లు తీయడం విశేషం.
Here's Videos
టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ -5 బౌలర్ల జాబితాలో అండర్సన్ ఒకడు. 188 మ్యాచుల్లో 704 వికెట్లు పడగొట్టిన జిమ్మీ మూడో స్థానంలో నిలిచాడు. శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లతో టాప్‌లో ఉండగా.. 708 వికెట్లు తీసిన దివంగత షేన్ వార్న్(ఆస్ట్రేలియా) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (619), ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్(604)లు వరుసగా నాలుగు, ఐదో ప్లేస్‌లో నిలిచారు.
41 ఏళ్ళ ఆండర్సన్.. మైదానంలో తన చివరి క్షణాల్లో చాలా ఎమోషనల్ అయ్యాడు. సహచరులు అతన్ని ఘనంగా పెవిలియన్‌కు సాగనంపారు. లార్డ్స్ స్టేడియం మొత్తం లేచి నిలబడి ఆండర్సన్‌ను చప్పట్లతో అభినందించింది. ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఆండర్సన్ భార్య, సంతానం కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆండర్సన్ చివరి వికెట్ జాషువ డసిల్వ.సుదీర్ఘ కెరీర్ లెక్కలేనన్ని మైలురాళ్లను అధిగమించిన ఆండర్సన్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌గా కీర్తించబడతాడు.