Karthikeya 2: మళ్ళీ వాయిదా పడ్డ కార్తికేయ 2.. ఆగస్టు 13న విడుదల.. సినిమా వెనక్కి వెళ్లడంపై బాధపడ్డ నిఖిల్

ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ కార్తికేయ 2 తాజాగా మరోసారి పోస్ట్ పోన్ అయింది. ఆగస్టు 12న విడుదల కావాల్సిన తమ చిత్రాన్ని ఒకరోజు ఆలస్యంగా అంటే ఆగస్టు 13న తీసుకురానున్నట్టు హీరో నిఖిల్ పేర్కొన్నారు.

Karthikeya2 (Image Credits: Twitter)

Hyderabad, August 4:నిఖిల్ (Nikhil) హీరోగా 2014లో వచ్చిన కార్తికేయ (Karthikeya) సూపర్ హిట్ అయింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. తాజాగా మరోసారి ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. ‘అన్ని సినిమాలు ఆడాలి. చిత్ర పరిశ్రమ బాగుండాలి’ అనే ఉద్దేశంతో ఆగస్టు 12న విడుదల కావాల్సిన తమ చిత్రాన్ని ఒకరోజు ఆలస్యంగా అంటే ఆగస్టు 13న తీసుకురానున్నట్టు హీరో నిఖిల్ పేర్కొన్నారు.

కమల్ హాసన్ భారతీయుడు 2కు మరో అవాంతరం.. అందుబాటులో లేని కాజల్.. కొత్త హీరోయిన్ల కోసం నిర్మాతల వేట.. ఇద్దరు బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో ఒకరు ఫైనల్?

సినిమాల మధ్య క్లాష్ రాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. అయితే, ప్రతీసారి తమ చిత్రమే వెనక్కి వెళ్ళిపోతుండటం బాధగా ఉందని తెలిపారు. దర్శకుడు చందూ మొండేటి (Chandu Mondeti) తెరకెక్కించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక (Anupama Parameshwaran).

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement