IPL Auction 2025 Live

Bihar Shocker: ఫేస్‌బుక్‌ చాటింగ్‌తో యువతిని ట్రాప్ చేసి, ఆమె న్యూడ్ వీడియోలు లీక్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్, ఇంతలో ఏం జరిగిందంటే..

ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు బాలికను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు.

file

బీహార్‌లోని ముంగేర్‌లో ఓ బాలిక అశ్లీల వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఘటన యావత్ దేశానికి షాక్ తగిలేలా చేసింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు బాలికను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేసు ముంగేర్ జిల్లాలోని తారాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇక్కడ నివాసముంటున్న బాలిక ఫేస్‌బుక్‌లో ఓ యువకుడితో స్నేహం చేసింది. యువకుడు మొదట తన ప్రేమలో బాలికను ట్రాప్ చేసి, ఆమెను అత్యాచారం చేసేందుకు కూడా ప్రయత్నించాడని పోలీసులు చెబుతున్నారు.

సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన బాధిత బాలికన పరీక్ష రాసేందుకు గత వారం ధన్‌బాద్ వెళ్లినట్లు సమాచారం. ఈ సమయంలో, యువకుడు ఆమెను కలుసుకుని, ఆమెను ఒక మాల్‌కు రప్పించాడు, అక్కడ అమ్మాయికి మత్తు మందు కలిపిన శీతల పానీయం ఇచ్చాడు. తన గదికి తీసుకెళ్లి ఆమె నగ్న వీడియోలు తీశాడు. కొన్ని రోజుల తర్వాత యువకుడు బాలికను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. అతను బాలిక ఆధార్ కార్డు, సంతకం కోసం అడిగాడు, బాలిక నిరాకరించడంతో, ఆమెను మానసికంగా హింసించడం ప్రారంభించాడు. వీడియోను వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో పాటు ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు.

Chhattisgarh Shocker: భార్యను చంపి శవాన్ని ముక్కలు ముక్కలుగా 

యువతి అతడి డిమాండ్ కు ఒప్పుకోకపోవడంతో, ఆమె అభ్యంతరకరమైన ఫోటోలు  వీడియోలను వైరల్ చేసినట్లు బాలిక ఆరోపించింది. దీంతో బాలికతో పాటు ఆమె కుటుంబసభ్యులు మానసిక క్షోభకు లోనయ్యారు. దీంతో బాధిత యువతి బంధువులు తారాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిని కోల్‌కతాలో అరెస్ట్ చేశారు.

నిందితుడు వివిధ ఫోన్ల నుంచి అసభ్యకర వీడియోలు, ఫొటోలను యువతి సన్నిహితులు, బంధవులకు  పంపుతున్నాడని డీఎస్పీ పంకజ్ కుమార్ తెలిపారు. బాలిక కుటుంబ సభ్యులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా నిందితుడిపై ఆధారాలు లభ్యమయ్యాయి. నిందితుడిని కోల్‌కతాలో అరెస్టు చేశారు.