Madhya Pradesh: వైరల్ వీడియో, అధిక ఛార్జీ వసూలు చేసినందుకు కండక్టర్‌ను చితకబాదిన ప్రయాణికుడు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్లిప్

సహనం కోల్పోయిన సదరు ప్రయాణికుడు.. కండక్టర్‌ను చితకబాదేశాడు. అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు వాళ్లను ఆపే ప్రయత్నం చేయగా.. ప్రయాణికుడు బస్సు దిగిపోవడం, ఆ వెనకాల కండక్టర్‌ పరుగులు తీయడం వరకు బస్సులోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యింది.

Bhopal Bus Conductor Attacked By Passenger Video Viral (Photo-Video Grab)

మధ్యప్రదేశ్‌ భోపాల్‌లో అధిక ఛార్జీలు వసూలు చేసినందుకు ఓ కండక్టర్‌ను చితకబాదేశాడు ఓ ప్రయాణికుడు. మంగళవారం ఉదయం పది గంటల ప్రాంతంలో.. పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ బస్టాప్‌ దగ్గర ఓ వ్యక్తి బస్సెక్కాడు. తాను దిగాల్సిన స్టాప్‌కు పది రూపాయలే టికెట్‌ కాగా.. కండక్టర్‌ మాత్రం ముందుస్టాప్‌ నుంచి టికెట్‌ కొట్టి.. మరో ఐదు రూపాయలు ఎక్కువగా వసూలు చేయాలని ప్రయత్నించాడు.

వైరల్ వీడియో, నిన్ను క్షమించాలంటే నాకో ముద్దివ్వు, బుడ్డోడిని దారిలోకి తీసుకువచ్చిన ఓ టీచర్, సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న వీడియో

ఈ క్రమంలో ఎన్‌సీసీ క్యాడెట్‌కు చెందిన సదరు ప్రయాణికుడు.. అధిక వసూలుపై నిలదీశాడు. తాను ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చేశాడు. అయినా సరే ఐదు రూపాయలు ఇవ్వాలని, లేదంటే దిగిపోవాలని కండక్టర్‌ చెప్పాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన సదరు ప్రయాణికుడు.. కండక్టర్‌ను చితకబాదేశాడు. అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు వాళ్లను ఆపే ప్రయత్నం చేయగా.. ప్రయాణికుడు బస్సు దిగిపోవడం, ఆ వెనకాల కండక్టర్‌ పరుగులు తీయడం వరకు బస్సులోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యింది.

Here's Video

ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించింది రవాణా శాఖ. దీంతో సదరు ఎన్‌సీసీ క్యాడెట్‌పై జహాంగీర్‌బాద్‌ పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement