Marriage: వృత్తిరీత్యా వేరే రాష్ట్రంలో ఉంటున్న భర్త.. మొగుడితో ఎడబాటును తట్టుకోలేక.. అతని సోదరుడితో వివాహేతర సంబంధం కొనసాగించిన భార్య.. తన సోదరుడితో కలిసి ఉన్న సమయంలో భార్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. తమ్ముడికే ఇచ్చి భార్యకు వివాహం.. 24 ఏండ్ల వివాహ బంధానికి గుడ్ బై.. పశ్చిమ బెంగాల్‌లో ఘటన

సోదరుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న తన భార్యను అతడికే ఇచ్చి పెళ్లి చేశాడో భర్త. పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో జరిగిందీ ఘటన.

Marriage (Credits: Google)

Kolkata, October 31: సోదరుడితో (Brother) వివాహేతర సంబంధం (Illegal connection) పెట్టుకున్న తన భార్య (Wife)ను అతడికే ఇచ్చి పెళ్లి (Marriage) చేశాడో భర్త (Husband). పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) నదియా (Nadia) జిల్లాలో జరిగిందీ ఘటన. శాంతిపూర్‌కు చెందిన అమూల్య దేబ్‌నాథ్, బబ్లా ప్రాంతానికి చెందిన దీపాలికి 24 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 22 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అతడికి కూడా వివాహమైంది. వృత్తిరీత్యా అమూల్య దేబ్‌నాథ్ వేరే రాష్ట్రంలో ఉంటున్నాడు.

మునుగోడు ఉప ఎన్నిక బరిలో పోటీ చేస్తున్న కేఏ పాల్ రోజుకో అవతారం.. తాజాగా గొర్రెలు కాసిన ప్రజాశాంతి పార్టీ అధినేత... వీడియో వైరల్.. ఇంతకీ ఆయన ఏమన్నారంటే??

ఈ క్రమంలో దీపాలి తన భర్త సోదరుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. సోదరుడితో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం తెలుసుకున్న అమూల్య వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అనంతరం ఈ విషయాన్ని గ్రామస్థుల దృష్టికి తీసుకెళ్లాడు. ఆమెతో ఇక కాపురం చేయడం తన వల్ల కాదని తేల్చిచెప్పాడు. గ్రామస్థుల సమక్షంలోనే తన భార్యను సోదరుడు కిశబ్‌కు ఇచ్చి వివాహం చేశాడు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement