Munugode, October 31: మునుగోడు (Munugode) ఉప ఎన్నిక బరిలో పోటీ చేస్తున్న కేఏ పాల్ (KA Paul) రోజుకో అవతారంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా గొర్రెల కాపరి (Shepherd) వేషంలో దర్శనమిచ్చారు. నియోజకవర్గం పరిధిలో కాసేపు గొర్రెలు (Sheeps) కాశారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడారు. చేసిన 100 వాగ్దానాల్లో ఒక్కటీ నిలబెట్టుకోలేదని అధికార పక్షంపై (Ruling Party) విమర్శలు చేశారు.
ఇక్కడి గొర్రెల కాపరులను అడిగితే, ఎనిమిదేళ్లుగా వీళ్ల చేతుల్లో నరకం అనుభవిస్తున్నామని చెప్పారని వెల్లడించారు. "గొర్రెలను ఇస్తానని ఎక్కడైనా ఇచ్చాడా? ఇచ్చినవి ఎక్కడైనా బతికున్నాయా? అయినా, చదువుకున్నవాళ్లకు ఉద్యోగాలు ఇవ్వరా? ఇలా గొర్రెలు కాసుకోవాలా? ఎంత కష్టం! మీ కొడుకులు, మీ కూతుర్లు ఏమో వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకుని ప్రపంచమంతా తిరుగుతారు. ఎందుకంటే మీరు దొరలు... మేం బీసీలం. ఈ నాటకం ఇక ఎంతమాత్రం చెల్లదు. వాగ్దానాలు ఎందుకు నిలబెట్టుకోలేదో ముందు సమాధానం చెప్పండి. ఇక్కడికొచ్చి ఎలా ఓట్లు అడగ్గలుగుతున్నారు? ఇది సిగ్గుపడాల్సిన విషయం" అంటూ కేఏ పాల్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
#MunugoduBypoll mass 😎 ✨️ pic.twitter.com/iFBqI4ft9A
— Paul Boss (@KAPaulMass) October 30, 2022