Car Accident: ఏందయ్యా ఇది.. ఇలాంటి ఘన స్వాగతాన్ని నేనెప్పుడూ చూడలే.. షోరూము నుంచి ఇంట్లోకి వస్తూనే అదుపు తప్పిన కొత్త కారు.. బైకులు ధ్వంసం

గేటు నుంచి లోపలికి వచ్చిన కారును నియంత్రించడంలో విఫలమైన డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి అక్కడ పార్క్ చేసిన బైకులను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది.

Car (Credits: Twitter)

Mumbai, October 9: షోరూము (Showroom) నుంచి కొత్త కారుతో (New Car) ఇంటికొచ్చిన వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. గేటు (Gate) నుంచి లోపలికి వచ్చిన కారును నియంత్రించడంలో విఫలమైన డ్రైవింగ్ సీట్లో (Driving Seat) ఉన్న వ్యక్తి అక్కడ పార్క్ చేసిన బైకులను (Bikes) ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. వినోద్ కుమార్ అనే వైమానిక దళ మాజీ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేస్తూ.. ‘వాట్ ఏ గ్రాండ్ అరైవల్ హోమ్’ అని క్యాప్షన్ తగిలించారు.

ఉద్ధ‌వ్, షిండే వ‌ర్గాల‌కు ఈసీ షాక్.. శివసేన 'విల్లంబు' గుర్తు ఫ్రీజ్.. రేపటిలోగా కొత్త గుర్తులు ఎంచుకోవాల‌ని ఇరు వ‌ర్గాల‌కు ఈసీ ఆదేశం..

ముంబైలో గురువారం ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అయింది. గేటు నుంచి ఇంటి ప్రాంగణంలోకి వస్తూనే అక్కడ పార్క్ చేసిన బైక్‌లను ఢీకొట్టుకుంటూ ముందుకెళ్లింది. ఈ క్రమంలో బోల్తా పడబోయి కుదురుకుంది. గేటు తీసిన వ్యక్తితోపాటు సెక్యూరిటీ గార్డు  పరుగుపరుగున రావడం కనిపించింది. ఈ వీడియోను చూసిన వారిలో కొందరు రిబ్బన్ కటింగ్ కూడా చేయకముందే ప్రమాదం జరగడం విషాదమని అంటే.. మరికొందరు మాత్రం ఇలాంటి ఘన స్వాగతాన్ని తామెప్పుడూ చూడలేదని కామెంట్ చేస్తున్నారు. డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి బ్రేక్‌కు బదులుగా యాక్సెలరేటర్ నొక్కి ఉంటాడని ఇంకొందరు చెబుతున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif