Jharkhand Horror: రూ.10 అడిగాడని కుమారుడిని అంతమొందించిన తండ్రి.. ఝార్ఖండ్‌లోని ఛత్రాజిల్లాలో దారుణం

దీన్ని నిజం చేస్తూ.. మద్యం మత్తులో ఓ వ్యక్తి తన కుమారుడినే బలితీసుకున్నాడు. రూ.10 అడిగినందుకు ఏకంగా గొంతు నులిమి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఝార్ఖండ్‌లోని ఛత్రాజిల్లాలో చోటుచేసుకుంది.

Murder Representational image (Photo Credit- ANI)

Ranchi, June 13: మద్యం ఎంతటి వారినైనా విచక్షణ కోల్పోయేలా చేస్తుంది అంటారు. దీన్ని నిజం చేస్తూ.. మద్యం (Alcohol) మత్తులో ఓ వ్యక్తి తన కుమారుడినే (Son) బలితీసుకున్నాడు. రూ.10 అడిగినందుకు ఏకంగా గొంతు నులిమి  చంపేశాడు. ఈ దారుణ ఘటన  ఝార్ఖండ్‌లోని (Jharkhand) ఛత్రాజిల్లాలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే, బీలేశ్ భూయాన్(48) తన భార్య, 15 ఏళ్ల కుమార్తె, 12 ఏళ్ల కుమారుడు పప్పు యాదవ్‌తో కలిసి వశిష్టనగర్ లో నివసిస్తున్నాడు. సోమవారం ఉదయం భార్యభర్తలు పూటుగా తాగి గొడవపడ్డారు. ఈ క్రమంలో బాలుడు పది రూపాయలు ఇవ్వాలంటూ తండ్రిని అడిగాడు. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న భూయాన్ విచక్షణ మరిచి కుమారుడిని గొంతు నులిమి ఉపిరాడకుండా చేసి పొట్టనపెట్టుకున్నాడు.

Priyanka Gandhi: 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు ఇవ్వనున్న కాంగ్రెస్, వరుస విజయాలతో ప్రియాంకకు పెరుగుతున్న ఆదరణ..

అలా విషయం బయటకు..

ఈ క్రమంలో ఇసుకబట్టిలో తన పని ముగించుకుని కుమార్తె ఇంటికి వచ్చింది. ఇంటికొచ్చాక తండ్రి చేసిన ఘోరం గురించి తెలిసి భయంతో పెద్దపెట్టున కేకలు వేసింది. దీంతో, అప్రమత్తమైన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Sudigali Sudheer: యాంకర్ రష్మీకి షాక్ ఇచ్చి, పెళ్లి చేసుకోబుతున్న సుడిగాలి సుధీర్, అమ్మాయి ఎవరో తెలుసా..?