Mohammed Siraj: మహ్మద్ సిరాజ్ ఆ పనితో ఫ్యాన్స్ ఫిదా! హైదరాబాదీ బౌలర్‌ను ఆకాశానికెత్తుతున్న ఫ్యాన్స్, ఇంతకీ సిరాజ్ చేసిన పనేంటో ఈ వీడియోలో చూడండి

ఆ సమయంలో తన వెనుక గ్యాలరీలో ఉన్న అభిమానులు కేరింతలు కొడుతున్నాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని తనకు డ్రింక్స్‌ కావాలని అడగడంతో సిరాజ్‌.. తన ఎనర్జీ డ్రింక్స్‌లోంచి ఒక బాటిల్‌ను అభిమానికి ఇచ్చేశాడు.

Mohammed Siraj (Screen garb from viral video)

Indore, March 03: బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో ఇవాళ ఆస్ట్రేలియా గెలిచింది. భారత్‌ 9 వికెట్ల తేడాతో ఓడిపోయి సిరీస్‌లో తన ఆధిక్యాన్ని 2-1కు తగ్గించుకుంది. భారత్‌ నిర్దేశించిన 76 స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్‌ కేవలం ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి చేధించింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోయి అభిమానులను నిరుత్సాహపర్చినప్పటికీ.. బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj) మాత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. అయితే ఆయన ప్రేక్షక హృదయాలను దోచింది ఆటతో కాదు, మరెలాగో తెలుసా..?

ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆడుతున్న సందర్భంగా మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj) బౌండరీ లైన్‌ దగ్గర ఫీల్డింగ్‌ చేస్తున్నాడు. ఆ సమయంలో తన వెనుక గ్యాలరీలో ఉన్న అభిమానులు కేరింతలు కొడుతున్నాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని తనకు డ్రింక్స్‌ కావాలని అడగడంతో సిరాజ్‌.. తన ఎనర్జీ డ్రింక్స్‌లోంచి ఒక బాటిల్‌ను అభిమానికి ఇచ్చేశాడు. దాంతో అభిమానులు ఫిదా (Beautiful Gesture) అయిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.