Itching Powder On Minister: ఇదేందయ్యా.. ఇది?? మంత్రిపై దురద పుట్టించే పౌడర్ చల్లడమా?? మధ్యప్రదేశ్ లో నవ్వుతెప్పిస్తున్న ఘటన.. వీడియో ఇదిగో!
భోపాల్ లో బీజేపీ ఆధ్వర్యంలో రథయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి బ్రిజేంద్ర సింగ్ యాదవ్ కూడా పాల్గొన్నారు. రథయాత్ర సాగుతుండగా ఓ వ్యక్తి మంత్రిని లక్ష్యంగా చేసుకుని దురద పుట్టించే పౌడర్ చల్లాడు.
Bhopal, Feb 11: తమకు కావాల్సిన పనులు చేయని ప్రజాప్రతినిధులపై ఇంకు (Ink) దాడి చేయడం చూశాం. అయితే, మధ్యప్రదేశ్ (Madhyapradesh) లో ఓ మంత్రిపై జరిగిన విచిత్ర దాడి నవ్వులు పూయిస్తుంది. విషయమేంటంటే.. భోపాల్ (Bhopal) లో బీజేపీ (BJP) ఆధ్వర్యంలో రథయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి బ్రిజేంద్ర సింగ్ యాదవ్ (Brijendra Singh Yadav) కూడా పాల్గొన్నారు. రథయాత్ర సాగుతుండగా ఓ వ్యక్తి మంత్రిని లక్ష్యంగా చేసుకుని దురద పుట్టించే పౌడర్ చల్లాడు.
దాంతో, మంత్రి గోక్కోవడం.. అనంతరం కడుక్కోవడం మొదలుపెట్టారు. తన దురద బాధను అక్కడున్నవారికి నవ్వుతూ వివరించగా, వారు కూడా ఆయనతో కలిసి నవ్వులు పూయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Free Bus For SSC Students: టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?
Advertisement
Advertisement
Advertisement