Shaktimaan: ఏమయ్యా.. శక్తిమాన్?! దేవుడు నోరిచ్చాడని ఏది పడితే, అది అంటావా? ముఖేష్ ఖన్నాను చెడుగుడు ఆడుకున్న నెటిజెన్లు.. ఎందుకంటే?

మండిపడ్డ నెటిజెన్లు

Shaktimaan (Photo Credits: Twitter)

Mumbai, August 11: శక్తిమాన్ (Shaktimaan)గా 90ల కిడ్స్ కి సూపర్ హీరోగా ఇప్పటికీ హృదయాల్లో చెదరని ముద్ర వేసిన నటుడు ముఖేష్ ఖ‌న్నా (Mukesh Khanna) మహిళలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్య‌లు పెనుదుమారం రేపాయి. యూట్యూబ్ చానెల్‌ను న‌డుపుతున్న ఆయన ప‌లు అంశాల‌పై యూట్యూబ్ వేదిక‌గా త‌న అభిప్రాయాలు వెల్ల‌డిస్తుంటారు. తాజా వీడియోలో మాట్లాడుతూ.. లైంగిక వాంఛ‌లు తీర్చాల‌ని పురుషుడిని కోరేవారు మ‌హిళ‌లు కాద‌ని, వారు సెక్స్ వ‌ర్క‌ర్ల‌ (Sexworkers)ని వ్యాఖ్యానించారు. సంప్రదాయంగా పెరిగిన బాలికలెవ‌రూ లైంగిక వాంఛ‌లు తీర్చాల‌ని యువ‌కుడిని కోర‌రని కొత్త సూక్తులు చెప్పుకొచ్చాడు.

హాస్య నటుడు రాజు శ్రీవాస్తవకు గుండెపోటు.. ఎయిమ్స్ కు తరలింపు.. నిలకడగా పరిస్థితి

ఇంట‌ర్‌నెట్‌లో వ‌ల‌ప‌న్నే మ‌గువ‌ల ప‌ట్ల పురుషులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హిత‌వు ప‌లికారు. ముఖేష్ ఖ‌న్నా వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు భ‌గ్గుమ‌న్నారు. ఆయ‌న ఓ సెక్సిస్ట్ (Sexist) అని ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్లు చేశారు. ఏమయ్యా.. శక్తిమాన్?! దేవుడు నోరిచ్చాడని ఏది పడితే, అది అంటావా? అంటూ నిప్పులు చెరిగారు.

 

View this post on Instagram

 

A post shared by Bollywoodshitposts (@bollywoodshitposts)