Naga Chaitanya: సమంతతో లవ్ లో ఉండగా వేయించుకున్న టాటూ ఇంకా చై చేతిపైనే.. తీసేస్తారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. చై ఏమన్నాడంటే??

తన చేతిపై పొడిపించుకున్న టాటూపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నాగచైతన్య. 'నా టాటూని అభిమానులు ఎవరూ కాపీ కొట్టొద్దు. ఎందుకంటే ఇది సమంతతో నా పెళ్లిరోజు తేదీని మోర్స్‌ కోడ్‌ రూపంలో టాటూ వేయించుకున్నా. కీలకమైన విషయాలని టాటూగా వేయించుకోవద్దు. ఎందుకంటే భవిష్యత్తులో అవి మారిపోవచ్చు' అంటూ పేర్కొన్నాడు.

Samantha-NagaChaitanya (Photo Credits: Twitter)

Hyderabad, August 10: టాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకొని, ఉన్నట్టుండి విడిపోతూ అందరికీ షాక్ ఇచ్చిన జోడీ నాగ చైతన్య-సమంత (Samantha). వీళ్ళిద్దరూ విడిపోయి పదినెలలు అయినా.. వీరి గురించి ఏ ఒక్క విషయం బయటపడినా అది సంచలనంగానే మారుతున్నది. తాజాగా సమంతతో లవ్ లో ఉండగా చై (Nagachaitanya) తన చేతిపై పొడిపించుకున్న టాటూపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నా టాటూని అభిమానులు  ఎవరూ కాపీ కొట్టొద్దు. ఎందుకంటే ఇది సమంతతో నా పెళ్లిరోజు (Wedding anniversary) తేదీని మోర్స్‌ కోడ్‌ రూపంలో టాటూ వేయించుకున్నా. కీలకమైన విషయాలని టాటూగా వేయించుకోవద్దు. ఎందుకంటే భవిష్యత్తు (Future)లో అవి మారిపోవచ్చు' అంటూ పేర్కొన్నాడు.

ఇంకా వైరల్ అవుతోన్న ఊ అంటావా మామ సాంగ్, భారత్-వెస్టీండీస్ మ్యాచ్ సమయంలో సమంత పాటకు డ్యాన్స్ తో అదరగొట్టిన క్రికెట్ అభిమానులు

అయితే ఆ టాటూ(Tattoo)ని తొలగించాలని ఎప్పుడైనా అనుకున్నారా? అని యాంకర్‌ ప్రశ్నించగా.. ఎప్పడూ దాని గురించి ఆలోచించలేదు. టాటూ మార్చడానికి ఏమీ లేదు. పర్లేదు అంటూ చైతూ  సమాధానం ఇచ్చాడు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement