వెంకీ మామగా విక్టరీ వెంకటేశ్ (Daggubati Venkatesh), ఆయనకు అల్లుడిగా నాగ చైతన్య (Akkineni NagaChaitanya) మరియు వీళ్లిద్దరికి జోడీగా పాయల్ రాజ్‌పుత్ , రాశి ఖన్నాలు నటిస్తున్న చిత్రం 'వెంకీ మామా' (Venky Mama). ఈ ఏడాది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఈ చిత్రం ఒకటి. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ మరియు పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ఏది బయటకు వచ్చిన ప్రేక్షకులు విపరీతమైన ఆసక్తిని కనబరుస్తున్న సమయంలో 'కోకాకోలా పెప్సీ - ఈ మామా అల్లుడు సెక్సీ' అంటూ విడుదల చేసిన ఒక పార్టీ సాంగ్ నిజంగా సెక్సీగా ఉంది. మంచి లిరిక్స్‌తో, మీడియం పేస్ బౌలింగ్ లాగా స్మూత్‌గా సాగిపోయే బీట్‌తో ఉన్న ఈ సాంగ్ వింటే ఎవరైనా క్లీన్ బౌల్డ్ అవ్వాల్సిందే.
ఈ పాటలో పాయల్‌తో వెంకటేష్ చార్మింగ్ మరియు రాశి- నాగ చైతన్యల మధ్య సిజ్లింగ్ కెమిస్ట్రీ ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తున్నాయి. ఈ రెండు జోడీలు కలిసి వేసే స్టెప్పులు సింప్లీ సూపర్బ్ అనిపిస్తున్నాయి. సాంగ్ పిక్చరైజేషన్ కూడా కలర్‌ఫుల్‌గా, రిచ్‌గా ఉంది. ఆ పాటను మీరూ చూసేయండి.
Coca Cola Pepsi Song:
ఈ కోకాకోలా పెప్సీ పాట లిరిక్స్ కాసర్ల శ్యామ్ (Kasarla Shyam ) రాశారు. ఈ మధ్య మంచి ఊపున్న పార్టీ సాంగ్స్ లిరిక్స్ అన్ని కసర్ల శ్యామ్ నుంచే వస్తున్నాయి. అల వైకుంఠపురములో 'రాములో.. రాముల' పాట, సవారి నుంచి 'దోస్తులందరికీ దావత్ ఇస్తా' పాట ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. అంతకుముందు తెలంగాణ జానపదాలు అల్లిన అనుభవం ఉన్న కసర్ల శ్యామ్ ఇప్పుడు సినిమాలకు రాసే పాటల్లో కూడా జనాలకు తెలిసిన పదాలనే వాడుతూ పాటను జనాల్లోకి బాగా వెళ్లేలా అద్భుత లిరిక్స్ అందిస్తున్నారు. ఇక వెంకీ మామా సినిమాకి కూడా మంచి ఫామ్‌లో ఉన్న ఎస్. థమన్ (Thaman S) మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.
ఇక వెంకీ మామా విడుదల విషయానికి వస్తే డిసెంబర్ 13న థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమా పట్ల నాగ చైతన్య చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. తన కెరియర్‌లో మనం, వెంకీ మామా సినిమాలు ఎప్పటికీ నిలిచిపోయే ప్రత్యేక చిత్రాలని చెప్పారు.