Sobhita Dhulipala

Hyderabad, DEC 15: టాలీవుడ్ సెల‌బ్రిటీ జంట నాగ‌చైత‌న్య- శోభిత ధూళిపాళ (Shbitha Dhulipala) పెళ్లై ప‌దిరోజుల‌వుతోంది. ఇప్ప‌టికే ఆ జంట చెట్టాప‌ట్టేసుకొని తిరుగుతున్నారు. అయితే ఆమె పెళ్లి ఫోటోల‌పై నెట్టింట చ‌ర్చ జ‌రుగుతోంది. ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోల‌పై సోష‌ల్ మీడియాలో ర‌క ర‌కాల కామెంట్లు వ‌స్తున్నాయి. పెళ్లి సంద‌ర్భంగా ఆమె చాలా ఫోటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది. అందులో ఓ ఫోటో మాత్రం చాలా వైర‌ల్ అవుతోంది. దానిపై నెటిజ‌న్లు భిన్నంగా (Sobhita Dhulipala Faces Backlash ) స్పందిస్తున్నారు. ఇంత‌కీ ఈ ర‌చ్చ దేనికంటే..ఆమె నాగ‌చైత‌న్య కాళ్లు మొక్క‌డంపైనే. తాళి క‌ట్టిన త‌ర్వాత ఆనందంగా ఆమె త‌న భ‌ర్త నాగ‌చైత‌న్య కాళ్లు మొక్కింది.

Sobhita Dhulipala Faces Backlash

 

దీనికి ప‌లువురు అభిమానులు ర‌క ర‌కాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఆల్ ది బెస్ట్ అంటూ చాలా మంది కామెంట్ చేస్తే...ఇదేంటి ఇంకా ఇలాంటి సాంప్ర‌దాయాలు అంటూ కొంద‌రు వెక్కిరిస్తున్నారు. మ‌నం నిజంగా 2024లోనే ఉన్నామా? అంటూ ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొగుడు అనే అహంకారం ఇంకా ఎన్ని రోజుల అని కొంద‌రు, ఈ రోజుల్లో కూడా ఇదేం ప‌ని అంటూ మ‌రికొంద‌రు అంటున్నారు. ఫెమినిజంపై కొంద‌రు చ‌ర్చ మొద‌లు పెట్టారు. ఇదంతా బానిస‌త్వం కింద‌కు వ‌స్తుంద‌ని చాలా మంది ఈ ఫోటోల కింద కామెంట్ చేశారు.

అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఈ నెల 4న వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. నటిగా తనదైన ముద్ర వేసుకున్న శోభిత ధూళిపాళ ఈ ఏడాది మంకీ మ్యాన్ సినిమాతో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన శోభిత తన వ్యక్తిగత అభిరుచుల గురించి, భర్త నాగచైతన్య గురించి పలు విశేషాలను మీడియాతో పంచుకుంది. ఎంతోకాలంగా ఎదురుచూసిన ప్రేమ చైతూ రూపంలో తనకు దక్కిందని చెప్పుకొచ్చింది.