Nepal Bans Sale of Everest, MDH Spices: ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాలపై నిషేధం విధించిన నేపాల్.. కారణమేంటంటే..?
ఇండియన్ మసాలా బ్రాండ్స్ ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాలపై నిషేధం విధించినట్లు నేపాల్ ఫుడ్ టెక్నాలజీ విభాగం తెలిపింది.
Newdelhi, May 17: ఇండియన్ మసాలా బ్రాండ్స్ ఎవరెస్ట్ (Everest), ఎండీహెచ్ (MDH) మసాలాలపై (Spices) నిషేధం విధించినట్లు నేపాల్ ఫుడ్ టెక్నాలజీ విభాగం తెలిపింది. మార్కెట్ లో ఈ మసాలాల అమ్మకాలను వెంటనే నిలిపివేసినట్టు వెల్లడించింది. ఈ మసాలాలలో హానికరమైన రసాయనాలు ఉన్నాయని వార్తలు రావడంతో ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది.
ఎండీహెచ్, ఎవరెస్ట్ కంపెనీల మసాలాలు గత కొన్ని దశాబ్దాలుగా చాలా ఫేమస్. ఈ బ్రాండ్ ల మసాలా దినుసులు మిడిల్ ఈస్ట్ తో సహా ప్రపంచంలోని అనేక దేశాలకు ఎగుమతి అవుతాయి. కాగా ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో పురుగుల మందు అవశేషాలు ఉన్నట్లు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ గతంలో గుర్తించింది.