Pet Dog Rescues Baby Deer Video: నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న జింక పిల్లను కాపాడిన కుక్క, వైరల్ వీడియో...
కుక్కలు రక్షించేందుకు ప్రయత్నిస్తాయి. అందుకు ఈ వీడియోనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఒక చిన్న జింక పిల్లను ఓ పెంపుడు కుక్క రక్షించిన తీరు అందరిని అబ్బురపరుస్తుంది.
యజమానులకు ఎటువంటి ఆపద వాటిల్లినా..కుక్కలు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి రక్షించేందుకు ప్రయత్నిస్తాయి. ప్రమాదంలో ఉన్న ఏ జీవినైనా.. కుక్కలు రక్షించేందుకు ప్రయత్నిస్తాయి. అందుకు ఈ వీడియోనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఒక చిన్న జింక పిల్లను ఓ పెంపుడు కుక్క రక్షించిన తీరు అందరిని అబ్బురపరుస్తుంది. ఉదృతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహంలో ఓ జింక పిల్ల చిక్కుకుంది. ఎంతకూ బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నా నీటి వేగానికి అది కొట్టుకుపోతుంది. ఇది గమనించిన ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను నీటిలోకి వదిలాడు. ఉదృతంగా ప్రవహిస్తున్న కాలువను ఈదుకుంటూ ఆ శునకం, జింక పిల్లను నోట కరుచుకుని ఒడ్డుకు చేర్చింది. దీంతో యజమాని ఆ కుక్కను “గుడ్ బాయ్(Good Boy) అంటూ ప్రేమగా తల నిమిరి, ఆ జింక పిల్లను అందుకున్నాడు. నీటి ప్రవాహంలో చిక్కుకుని ప్రాణాల కోసం గిజగిజలాడిన ఆ జింక పిల్ల.. ప్రాణాలు దక్కడంతో బ్రతుకు జీవుడా అనుకుంది. ఈ దృశ్యాన్ని కుక్క యజమాని వీడియో తీయగా..”Universal Gyan 4u” అనే యూట్యూబ్ ఛానల్ ఆ వీడియోని పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో వీడియో సూపర్ వైరల్ అయింది. అది చూసిన నెటిజన్లు కుక్క సాహసాన్ని ప్రశంసిస్తున్నారు.