UP Horror: యూపీలోని రాంపూర్ లో అర్థరాత్రి.. ప్రతీ ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొడుతున్న నగ్న అవతార స్త్రీ.. ఆమె ఎవరో చెప్పేసిన పోలీసులు.. అసలేం జరిగింది?? వీడియోతో..

90వ దశకంలో తెలంగాణ గ్రామాల్లో ‘ఓ స్త్రీ రేపురా’ అంటూ ప్రతీ ఇంటి తలుపు మీద రాతలు రాసిన విషయం గుర్తుందా? ఇదీ అలాంటి ఘటనే..

Credits: Twitter

Lucknow, Feb 5: 90వ దశకంలో తెలంగాణ గ్రామాల్లో ‘ఓ స్త్రీ రేపురా’ అంటూ ప్రతీ ఇంటి తలుపు (Doors) మీద రాతలు రాసిన విషయం గుర్తుందా? ఇదీ అలాంటి ఘటనే.. అది అర్ధరాత్రి సమయం. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో ఇంటి కాలింగ్ బెల్ మోగింది. ఉలిక్కిపడి లేచిన ఇంట్లోని వారు తలుపు తెరిచి చూడగా.. గుండె ఆగినంత పని అయింది. వంటిపై చిన్నపాటి వస్త్రం కూడా లేకుండా దిగంబరంగా స్త్రీ (Naked Women) నిలుచుని ఉంది. ఉత్తరప్రదేశ్ లోని (Uttarpradesh) రామ్ పూర్ (Rampur) లో మిలక్ ప్రాంతంలో ఓ మహిళ కొన్ని రోజులుగా ఇదే చేస్తోంది.

ఖమ్మం జిల్లాలో వందేభారత్ రైలుపై దాడి... మూడు గంటల ఆలస్యం.. వీడియోతో

పలు ఇళ్ల ముందుకు వెళ్లి కాలింగ్స్ బెల్స్ మోగిస్తున్నట్టు, డోర్లను తడుతున్నట్టు సీసీటీవీ కెమెరాల్లోనూ రికార్డు అయింది. ఈ వీడియో ఫుటేజీలు సామాజిక మాధ్యమాలపైకి చేరాయి. దీనిపై స్థానికుడు ఒకరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇందుకు సంబంధించి శనివారం రామ్ పూర్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. సదరు మహిళను గుర్తించామని, వారి తల్లిదండ్రులతో మాట్లాడిన అనంతరం.. మానసిక అనారోగ్యంతో ఆమె బాధపడుతున్నట్టు తెలుసుకున్నామని ప్రకటించారు. గత ఐదేళ్లుగా బరేలీలో ఆమెకు చికిత్స కొనసాగుతున్నట్టు చెప్పారు.

మహారాష్ట్రలోని నాందేడ్‌లో నేడు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. పార్టీలో చేరనున్న ‘మహా’ నేతలు.. వీడియోతో

 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif