Ravichandran Ashwin Records: 11 సార్లు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు, రవిచంద్రన్ అశ్విన్ రికార్డులు ఇవిగో, హర్భజన్ సింగ్ ప్లేసు భర్తీ చేసి అద్భుతాలు సృష్టించిన లెజెండరీ ఆఫ్ స్పిన్నర్
ఇప్పుడు టైమ్ వచ్చిందనుకుంటున్నా. కెరీర్‌లో 106 టెస్టులు, 537 వికెట్లు, 3,503 పరుగులు సాధించా. భారత క్రికెట్‌లో నా భాగస్వామ్యం ఉండటం ఆనందంగా ఉంది’’ అని తెలిపాడు.
టీమిండియా లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు అనౌన్స్ చేశాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ సమక్షంలో మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అతడు తన నిర్ణయాన్ని ప్రకటించాడు.‘భారత్ తరఫున ఆడినందుకు గర్వంగా భావిస్తున్నా. ఇప్పుడు టైమ్ వచ్చిందనుకుంటున్నా. కెరీర్‌లో 106 టెస్టులు, 537 వికెట్లు, 3,503 పరుగులు సాధించా. భారత క్రికెట్‌లో నా భాగస్వామ్యం ఉండటం ఆనందంగా ఉంది’’ అని తెలిపాడు.
అంతకు ముందు డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీతో అశ్విన్ భావోద్వేగానికి గురైన వీడియో వైరల్ అవుతోంది. అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించినట్టు బీసీసీఐ కూడా ఎక్స్ వేదికగా వెల్లడించింది. అంతర్జాతీయ క్రికెట్ లో ఆల్ రౌండర్ గా అద్భుత ప్రదర్శన కనబరిచారని బీసీసీఐ ప్రశంసించింది. 38 ఏళ్ల అశ్విన్ 2011లో వెస్టిండీస్ పై తొలి టెస్ట్ ఆడారు. 2010లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ తో వన్డే కెరీర్ ను ప్రారంభించారు.అశ్విన్ భారత జట్టులోకి అడుగుపెట్టి 13 ఏళ్లు కావొస్తోంది.
వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రిటైర్మెంట్ తర్వాత ఆ ప్లేస్‌ను భర్తీ చేసిన అశ్విన్.. 106 టెస్టులు ఆడి 3,503 పరుగులు చేశారు. 537 వికెట్లు తీశారు. టెస్టుల్లో 6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు సాధించారు. టెస్ట్ ఫార్మాట్ లో 37 సార్లు 5 వికెట్లు పడగొట్టిన ఘనత అశ్విన్ ది. ఒక టెస్ట్ లో 10 వికెట్లు తీసిన ఘనతను 8 సార్లు సాధించారు.టెస్టు కెరీర్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు అశ్విన్.
Ravichandran Ashwin Retirement
అనిల్ కుంబ్లే తర్వాత రెండో స్థానంలో ఉన్నాడతను. కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు తీసిన విషయం తెలిసిందే.రికార్డు స్థాయిలో అశ్విన్ 11 సార్లు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. మేటి స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌తో సమానంగా నిలిచాడతను. 116 వన్డేల్లో 707 పరుగులు చేశారు. 156 వికెట్లు పడగొట్టారు. 65 టీ20ల్లో 72 వికెట్లను పడగొట్టారు. పొట్టి ఫార్మాట్ లో 154 పరుగులు చేశారు.మొత్తం 4,400 పరుగులు సాధించాడు. ఓవరాల్‌గా 765 వికెట్లు పడగొట్టాడు.
థ్యాంక్యూ అశ్విన్. అద్భుతం, ఇన్నోవేషన్, తెలివైన బౌలర్‌కు పర్యాయపదంగా మారావు. సీనియర్ స్పిన్నర్‌గా భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించావు. లెజండరీ కెరీర్‌ను కొనసాగించినందుకు కంగ్రాట్స్’’ అని బీసీసీఐ పోస్టు పెట్టింది. అశ్విన్ వీడ్కోలు నిర్ణయంపై ఆసీస్ టాప్ స్పిన్నర్ నాథన్ లైయన్ కూడా స్పందించాడు. మున్ముందు భవిష్యత్తు మరింత ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.