Self Luggage Check-In: విమానాశ్రయంలో తక్కువ సమయంలోనే లగేజ్‌ చెక్‌-ఇన్‌.. లగేజ్‌ సెల్ఫ్‌ చెక్‌-ఇన్‌ సేవలు అందుబాటులోకి

దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లో లగేజీ చెక్ ఇన్ ప్రాసెస్ ఓ పెద్ద ప్రహసనంలా సాగుతుంది. గంటల పాటు వేచి చూడాలి.

Delhi Airport (Credits: X)

Newdelhi, June 19: దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీలోని (Delhi) ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లో లగేజీ చెక్ ఇన్ ప్రాసెస్ ఓ పెద్ద ప్రహసనంలా సాగుతుంది. గంటల పాటు వేచి చూడాలి. దీంతో దూర ప్రయాణమంటేనే అందరూ భయపడే పరిస్థితి ఉండేది. దీంతో ప్రయాణికుల సౌలభ్యం కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ  ఎయిర్‌పోర్ట్‌ లో సోమవారం నుంచి ‘సెల్ఫ్‌ చెక్‌-ఇన్‌’ (Self Luggage Check-In) సర్వీసు అమల్లోకి వచ్చింది. ఇంతకు ముందులా కాకుండా, లగేజ్‌ చెక్‌-ఇన్‌ ను తక్కువ సమయంలో పూర్తి చేసేలా యాభై ‘సెల్ఫ్‌ సర్వీస్‌ బ్యాగ్‌ డ్రాప్‌’ యూనిట్లను విమానాశ్రయంలో ఏర్పాటుచేశారు. ఈ యూనిట్ల వద్ద ప్రయాణికులు తమంతట తామే లగేజ్‌ చెక్‌-ఇన్‌ ను పూర్తిచేయవచ్చు.వాటి ట్యాగ్‌ లు, బోర్డింగ్‌ పాస్‌ లను ప్రింట్‌ తీసుకొని విమానంలోకి ఎంచక్కా తక్కువ సమయంలోనే చేరిపోవచ్చు. more news here

బైక్ అదుపుతప్పి కింద పడిపోయిన డెలివరీ బాయ్.. అప్పుడే వెనుకనుంచి దూసుకొచ్చిన మెర్సిడెస్ కారు.. మీద నుంచి పోవడంతో అక్కడికక్కడే మృతిచెందిన డెలివరీ బాయ్... పూణేలో ఘోరం (వీడియో)

కెనడా తర్వాత ఇక్కడే..

సెల్ఫ్‌ చెక్‌-ఇన్‌ వ్యవస్థను తొలుత కెనడాలోని టొరంటో ఎయిర్‌పోర్ట్‌ లో తీసుకొచ్చారు. ఆ తర్వాత దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ కు దక్కుతుందని నిపుణులు చెప్తున్నారు.

వైసీపీ ఎంపీ బీద మస్తాన్‌ రావు కూతురు ర్యాష్ డ్రైవింగ్.. ఫుట్‌ పాత్‌ పైకి దూసుకెళ్లిన కారు.. నిద్రిస్తున్న యువకుడి మృతి.. నిందితురాలి అరెస్ట్.. అనంతరం బెయిల్ పై విడుదల

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement