Dog Tied to Scooter: బైక్ కు కుక్కను కట్టేసి, ఈడ్చుకెళ్ళిన కర్కోటకుడు.. ఉడుపి జిల్లాలో దారుణం.. పోలీసులకు ఫిర్యాదు (వీడియోతో)

మూగజీవంపై కర్కోటకుడు కర్కశంగా ప్రవర్తించాడు. కర్ణాటక రాష్ట్రం ఉడుపి జిల్లాలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనానికి కుక్కను కట్టి రోడ్డు మీద దారుణంగా లాక్కెళ్లడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Dog Tied to Scooter

Newdelhi, July 21: మానవత్వం మంటగలిసింది. మూగజీవంపై కర్కోటకుడు కర్కశంగా ప్రవర్తించాడు. కర్ణాటక (Karnataka) రాష్ట్రం ఉడుపి జిల్లాలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనానికి (Bike) కుక్కను (Dog) కట్టి రోడ్డు మీద దారుణంగా లాక్కెళ్లడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉడుపి జిల్లా కాపు తాలూకా శిర్వాలో శనివారం ఈ ఘటన జరిగింది. కుక్కను ద్విచక్రవాహనానికి కట్టుకుని సుమారు 6 కిలోమీటర్ల మేర లాక్కెళ్లిన వ్యక్తిని అబ్దుల్‌ ఖాదర్‌ గా గుర్తించారు. దీనిపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆపరేషన్ విశాఖ, వైసీపీ అధినేత జగన్‌కు బిగ్ షాక్, టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు, జనసేనలోకి మరికొంతమంది కార్పొరేటర్లు! 

ఎందుకు ఇలా?

కుక్కను చంపేందుకే ఇలా లాక్కెళ్లారని, ఆ వ్యక్తి అమానవీయంగా వ్యవహరించాడని, హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపాడని అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

ఆరెస్సెస్ కార్యకలాపాల్లో పాల్గొనొచ్చు.. ప్రభుత్వ ఉద్యోగులపై నిషేధం ఎత్తేసిన కేంద్ర ప్రభుత్వం