Jayasuriya Disciplines Sri Lanka Cricketers: జుట్టు కత్తిరించుకుని నీట్‌గా ఉండండి, శ్రీలంక క్రికెటర్లకు జయసూర్య క్రమశిక్షణ క్లాసులు
క్రికెట్ అనేది జెంటిల్మన్ క్రీడ అని, యువ ఆటగాళ్లకు క్రమశిక్షణ అవసరమని జయసూర్య అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లందరూ జుట్టు కత్తిరించుకుని, సాధారణ హెయిర్ స్టయిల్ ను అనుసరించాలని సూచించాడు.
శ్రీలంక క్రికెట్ జట్టు తాత్కాలిక కోచ్, బ్యాటింగ్ దిగ్గజం సనత్ జయసూర్య శ్రీలంక క్రికెటర్లకు క్లాస్ తీసుకున్నాడు. క్రికెట్ అనేది జెంటిల్మన్ క్రీడ అని, యువ ఆటగాళ్లకు క్రమశిక్షణ అవసరమని జయసూర్య అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లందరూ జుట్టు కత్తిరించుకుని, సాధారణ హెయిర్ స్టయిల్ ను అనుసరించాలని సూచించాడు. క్రికెటర్లు నీట్ గా ఉండడం అవసరమని, అభిమానులు తమను గమనిస్తుంటారన్న విషయాన్ని క్రికెటర్లు గుర్తించాలని జయసూర్య పేర్కొన్నాడు. భారత్‌తో మూడు టీ20లకు శ్రీలంక జట్టు ఇదిగో, కెప్టెన్‌గా చరిత్ అసలంక, లంకలో టీమిండియా ప్రాక్టీస్ వీడియో ఇదిగో..
తాను ప్రస్తుతం శ్రీలంక జట్టుకు తాత్కాలిక కోచ్ గా మ్రాతమే ఉన్నానని, ఆటగాళ్లు క్రమశిక్షణతో ఉండాలని కోరుకుంటానని తెలిపాడు. టీమిండియాతో శ్రీలంక టీ20 సిరీస్, వన్డే సిరీస్ ఆడనున్న నేపథ్యంలో జయసూర్య వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జయసూర్య వ్యాఖ్యలను శ్రీలంక ఆటగాళ్లు ఎంతవరకు పాటిస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది. శ్రీలంక, టీమిండియా మధ్య టీ20 సిరీస్ జులై 27 నుంచి, వన్డే సిరీస్ ఆగస్టు 2 నుంచి జరగనున్నాయి