
Vijayawada, Feb 25: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu naidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మంత్రులు నారా లోకేశ్, అనిత, వారి కుటుంబ సభ్యులను సోషల్ మీడియా వేదికగా దూషించిన కేసులో నటి శ్రీరెడ్డికి (Actress Sri Reddy) ఎట్టకేలకు హైకోర్టులో ఊరట లభించింది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన ఆమెపై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిలు కోరుతూ శ్రీరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో నమోదైన కేసులో హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేసింది. వారానికోసారి దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని శ్రీరెడ్డిని కోర్టు ఆదేశించింది.
శ్రీరెడ్డికి హైకోర్టులో ఊరట#Amaravati #andharapradesh #vijayawada #TeluguNews https://t.co/KaOXXzsabn
— Eenadu (@eenadulivenews) February 25, 2025
ఆ కేసులో ఊరట లేదు
చిత్తూరు పోలీసులు పెట్టిన కేసులో ముందస్తు బెయిలు పిటిషన్ కు విచారణ అర్హత లేదంటూ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. కర్నూలు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లోని కేసులకు సంబంధించి శ్రీరెడ్డికి నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకోవాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు.