Fake T20 World Cup Trophy: టీమిండియా చేతిలో ఉండేది డూప్లికేట్ ప్రపంచకప్ ట్రోఫీ, అసలైన వరల్డ్ కప్ ట్రోఫీ ఎక్కడుందో తెలుసుకోవాలంటే కథనం చదవాల్సిందే..

అవును భారత ఆటగాళ్ల చేతిలో ఉన్నది ఒరిజినల్ ట్రోఫీ కాదు. దాని డూప్లికేట్.. మరి డూప్లీకేట్ ట్రోఫీ ఎందుకు అందించారనే విషయంపై చాలా మందికి అనుమానం రావొచ్చు

Why Is Rohit Sharma and Co Carrying a Fake Trophy Despite Their Victory

టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో టీమ్ ఇండియా తిరిగి వచ్చింది, కానీ అది నిజమైన ట్రోఫీ కాదనే విషయం మీకు తెలుసా.. అవును భారత ఆటగాళ్ల చేతిలో ఉన్నది ఒరిజినల్ ట్రోఫీ కాదు. దాని డూప్లికేట్.. మరి డూప్లీకేట్ ట్రోఫీ ఎందుకు అందించారనే విషయంపై చాలా మందికి అనుమానం రావొచ్చు. అసలు కథలోకి వెళ్తే..ఏదైనా జట్టు ప్రపంచకప్ గెలిచినప్పుడు దానిని కేవలం ఫోటోషూట్ కోసం మాత్రమే అందిస్తారు.

కేవలం బహుకరించే సమయంలో మాత్రమే ఒరిజినల్ ట్రోఫీని జట్టుకు అందిస్తారు. దాంతో ఫోటోషూట్స్ అయిపోయాక విజేతలకు అచ్చం దాన్ని పోలి ఉండే నకిలీ ట్రోఫీ ఇస్తారు. ఈ డూప్లికేట్ ట్రోఫీనే మన టీమిండియా భారత్‌కు తీసుకొచ్చింది. ఒరిజినల్ ట్రోఫీ దుబాయ్‌లోని ఐసీసీ కార్యాలయంలోనే ఉంటుంది. బీసీసీఐ నుంచి 125 కోట్ల రూపాయల చెక్కును అందుకున్న టీమిండియా, వాంఖడే స్టేడియంలో లక్షలాది మంది అభిమానుల మధ్య కన్నుల పండుగగా టీమిండియా విక్టరీ పరేడ్

దాదాపు 17 ఏళ్ళ తరువాత భారత జట్టు రెండో ప్రపంచకప్ సాధించింది.చివరిసారిగా టీ20 వరల్డ్‌కప్‌ను ధోనీ సారథ్యంలో 2007లో గెలిచింది. తాజాగా టీమిండియా విశ్వవిజేతగా నిలవడంతో భారత ఆటగాళ్లకు ముంబైలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముంబై మెరైన్ డ్రైవ్ బీచ్ దగ్గర నుంచి వాంఖడే స్టేడియం వరకు రోడ్ షో నిర్వహించి.. ఆపై స్టేడియంలో ఆటగాళ్లను సన్మానించారు.

ఈ రోజు ప్రత్యేక ఫ్లైట్‌లో బార్బడోస్ నుంచి ఢిల్లీకి చేరుకున్నభారత ప్లేయర్స్‌కి అపూర్వ స్వాగతం లభించింది. ఎయిర్‌పోర్టు వద్ద ఫ్యాన్స్  ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీతో కలిసి.. అల్పాహారం సేవించడంతో పాటు కాసేపు ఆయనతో ముచ్చటించారు.  అనంతరం మెరైన్ డ్రైవ్ వద్ద విక్టరీ పరేడ్ లో పాల్గొన్నారు. అక్కడ నుంచి ఊరేగింపుగా వాంఖడే స్టేడియానికి చేరుకున్నారు. అక్కడ టీమిండియాకు బీసీసీఐ రూ. 125 కోట్ల నజరానాను ప్రకటించింది.