Plane On Trolly: ట్రాలీపై ‘పిస్తా హౌస్’ విమానం.. బాపట్ల జిల్లాలో ఇరుక్కుపోయిన వైనం.. పాత విమానాన్ని కొచ్చిన్ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా ఘటన.. కొరిశపాడు అండర్ పాస్ వద్ద ఇరుక్కుపోయిన లారీ.. హోటల్‌గా మార్చేందుకు విమానాన్ని కొనుగోలు చేసిన ‘పిస్తా హౌస్’

వినూత్న రీతిలో హోటల్‌ నిర్మాణాన్ని చేపడుదామని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ హోటల్ చైన్ ‘పిస్తా హౌస్’ భావించింది. ఈ క్రమంలో ఓ పాత విమానాన్నికొనుగోలు చేసింది. కొచ్చిన్ నుంచి ట్రాలీ లారీపై దాన్ని హైదరాబాద్ తరలిస్తున్నది. కాగా, బాపట్ల జిల్లాలోని మేదరమెట్ల బైపాస్‌లోని అండర్ పాస్ వద్ద విమానాన్ని తరలిస్తున్న ట్రాలీ ఇరుక్కుపోయింది.

Credits: Whatsapp

Bapatla, Nov 13: వినూత్న రీతిలో హోటల్‌ (Hotel) నిర్మాణాన్ని చేపడుదామని హైదరాబాద్‌కు (Hyderabad) చెందిన ప్రముఖ హోటల్ చైన్ ‘పిస్తా హౌస్’ (Pista House) భావించింది. ఈ క్రమంలో ఓ పాత విమానాన్ని(Old Plane) కొనుగోలు చేసింది. కొచ్చిన్ నుంచి ట్రాలీ లారీపై దాన్ని హైదరాబాద్ తరలిస్తున్నది. కాగా, బాపట్ల జిల్లాలోని మేదరమెట్ల బైపాస్‌లోని అండర్ పాస్ వద్ద విమానాన్ని తరలిస్తున్న ట్రాలీ ఇరుక్కుపోయింది.

అర్ధరాత్రి నెత్తురోడిన సూర్యాపేట.. మునగాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం.. అయ్యప్ప స్వామి పడిపూజకు హాజరై వస్తుండగా.. రాంగ్ రూట్‌లో ప్రయాణించిన ట్రాక్టర్.. ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ప్రమాదం

మేదరమెట్ల వద్ద కొండరాళ్లను తొలగించే పనులు ప్రారంభం కావడంతో హైదరాబాద్ వైపు వెళ్లే రోడ్డును మూసివేశారు. అటువైపు వెళ్లే వాహనాలను ఫ్లై ఓవర్ మీదుగా కొరిశపాడు అండర్ పాస్ ద్వారా మళ్లిస్తున్నారు. ఈ క్రమంలో విమానాన్ని తరలిస్తున్న లారీ అండర్‌పాస్‌ గుండా వెళ్లే ప్రయత్నం చేయగా, మధ్యలో ఎత్తు ఎక్కువగా ఉండడంతో ఇరుక్కుపోయింది. దీంతో విమానానికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తగా దానిని అండర్ పాస్ నుంచి బయటకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement