
Newyork, Jan 28: ప్రధాని నరేంద్ర మోదీ (Modi) అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో అంటే వచ్చే నెల మోదీ వైట్ హౌజ్ ను విజిట్ చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా తెలిపారు. దేశాధ్యక్షుడిగా రెండో సారి ఎన్నికైన ట్రంప్ తో.. సోమవారం ప్రధాని మోదీ ఫోన్ లో మాట్లాడారు. ఆ ఫోన్ సంభాషణ గురించి ట్రంప్ ఫ్లోరిడాలో రిపోర్టర్లతో మాట్లాడారు. భారత ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడనని ట్రంప్ అన్నారు. మోదీ వైట్ హౌజ్ కు రానున్నారని, బహుశా ఫిబ్రవరిలో ఆయన శ్వేతసౌధాన్ని విజిట్ చేసే ఛాన్సు ఉన్నట్లు ట్రంప్ తెలిపారు. ఇండియాతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
PM Modi may meet me in the White House in February: Donald Trump#ITVideo #NarendraModi #DonaldTrump #UnitedStates | @PoojaShali @MattooShashank pic.twitter.com/p9PlNRnvQY
— IndiaToday (@IndiaToday) January 28, 2025
గత టర్మ్ లో ఇలా..
మోదీతో ఫోన్ లో పలు కీలక అంశాల గురించి చర్చించినట్లు ట్రంప్ తెలిపారు. అమెరికాకు తొలిసారి దేశాధ్యక్షుడిగా చేసిన సమయంలో.. ట్రంప్ తన చివరి పర్యటన కోసం భారత్ కు వచ్చారు. ఈ క్రమంలోనే మోదీ-ట్రంప్ మధ్య మంచి రిలేషన్ ఏర్పడినట్టు చెప్తారు. 2019లో హూస్టన్ లో జరిగిన ర్యాలీలో.. 2020 ఫిబ్రవరిలో అహ్మదాబాద్ లో జరిగిన ర్యాలీలో ఇద్దరూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వీరి మీటింగ్స్ కోసం పెద్దసంఖ్యలో ప్రజలు హాజరైన విషయం తెలిసిందే.