PM Modi Sunglasses: నరేంద్ర మోదీ పెట్టుకున్న సన్ గ్లాసెస్ ధర లక్ష రూపాయలపైనే, సూర్య గ్రహణం వీక్షణపై ప్రధాని మోదీ చేసిన ట్వీట్ వైరల్, ఆయన ధరించిన నల్ల కళ్లజోడుపై విపరీతమైన చర్చ
దురదృష్టవశాత్తూ, మబ్బుల కారణంగా నేరుగా ఆ దృశ్యాన్ని చూడలేకపోయాను, కానీ కోజికోడ్ మరియు ఇతర ప్రాంతాలలో గ్రహణానికి సంబంధించిన దృశ్యాలను ఆన్ లైన్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడగలిగాను. నిపుణులతో సంభాషిస్తూ....
New Delhi, December 26: ఈరోజు సంభవించిన సూర్యగ్రహణం ఘట్టాన్ని వీక్షించేందుకు అందరిలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఆసక్తికనబరిచారు. 2019 చివరి సూర్యగ్రహణం (Solar Eclipse 2019) యొక్క దర్శనం తనకు లభించిందని ప్రధాని మోదీ (PM Narendra Modi) చెబుతూ ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు తాను చేసిన ప్రయత్నాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాగా, మోదీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయి, కొత్త చర్చకు దారితీసింది. ఆ ట్వీట్‌లో సూర్యగ్రహణం వీక్షించేందుకు మోదీ ఉపయోగించిన సన్ గ్లాసెస్ (Sunglasses) పై నెటిజన్లు విపరీతమైన పరిశోధన, చర్చ చేశారు. ఆ సన్ గ్లాసెస్ బ్రాండ్ ఏంటి, వాటి ధర ఎంత అనే విషయాలపై నెటిజన్లు ప్రధాని అనుకూల మరియు వ్యతిరేక వర్గాలుగా విడిపోయారు.
సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ఖరీదైన మేబాచ్ (Maybach) సన్ గ్లాసెస్ ఉపయోగించారని, వాటి ధర కనీసం రూ. లక్ష పైనే ఉంటుందని మోదీ వ్యతిరేక వర్గం ఆయనను విమర్శించగా, అలాంటిదేమి లేదని, ప్రధాని సాధారణమైన షేడ్స్‌నే ధరించారని ఆయన మద్ధతుదారులు ప్రతిగా ట్వీట్లు చేశారు. మోదీ రెట్రో బఫెలో హార్న్ (Retro Buffalo Horn) బ్రాండ్ యొక్క సన్‌గ్లాస్‌ను ధరించారు, వాటి ధర కేవలం రూ .3000 నుంచి రూ .5000 మధ్య ఉంటుందని చెబుతూ ఆ సన్‌గ్లాసెసెస్ యొక్క ఆన్‌లైన్ ధరను సూచించే స్క్రీన్ షాట్లను పోస్ట్ చేస్తున్నారు.
Check these tweets:
PM Modi Wore Retro Buffalo Horn Sunglass, Say His Supporters
అంతకుముందు, గురువారం ఉదయం 8:05 నిమిషాలకు మొదలైన సూర్యగ్రహణం ఉదయం 11:05 వరకు కొనసాగింది. ఆకాశంలో జరిగే ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు ప్రజలు ఆసక్తికనబరిచారు.
దీనిని ప్రధాని మోదీ కూడా ప్రస్తావిస్తూ, "చాలా మంది భారతీయుల మాదిరిగానే, నేను కూడా 2019 చివరి సూర్యగ్రహణం పట్ల ఆతృతతో ఉన్నాను. దురదృష్టవశాత్తూ, మబ్బుల కారణంగా నేరుగా ఆ దృశ్యాన్ని చూడలేకపోయాను, కానీ కోజికోడ్ మరియు ఇతర ప్రాంతాలలో గ్రహణానికి సంబంధించిన దృశ్యాలను ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడగలిగాను. నిపుణులతో సంభాషిస్తూ విషయ పరిజ్ఞానాన్ని పెంచుకున్నాను". అని మోదీ ట్వీట్ చేశారు.