Dalit Woman Raped: దళిత మహిళను రేప్‌ చేసి.. మూడు ముక్కలుగా నరికి చంపిన దుండగులు.. యూపీలో ఘోరం

దళిత మహిళపై కొంతమంది లైంగికదాడికి తెగబడటమేగాక, అనంతరం ఆమెను ముక్కలుగా నరికి పాశవికంగా హత్య చేశారు.

Assault (Image used for representational purpose only) (Photo Credits: ANI)

Newdelhi, Nov 3: ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh) లో గురువారం బాందాలో దారుణం చోటుచేసుకున్నది. దళిత మహిళపై కొంతమంది లైంగికదాడికి (Rape) తెగబడటమేగాక, అనంతరం ఆమెను ముక్కలుగా నరికి (Chopped) పాశవికంగా హత్య చేశారు. గిర్వాన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. ‘ఫ్లోర్‌ మిల్‌ శుభ్రం చేయడానికి రాజ్‌కుమార్‌ శుక్లా ఇంటికి వెళ్లిన దళిత మహిళ (40) తిరిగి రాకపోయే సరికి, ఆమె కూతురు అక్కడి వెళ్లింది. ఇంట్లో ఓ గదిలో నుంచి ఆమె అరుపులు విని లోపలికి వెళ్లి చూసింది.

JEE Syllabus: జేఈఈలో సిలబస్‌ తగ్గింపు.. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, గణితంలోని పలు అంశాల తొలగింపు.. మెయిన్‌ నోటిఫికేషన్‌ విడుదల

కొంతసేపటి తర్వాత గది తలుపులు తెరిచిచూసే సరికి.. మూడు ముక్కలైన తన తల్లి శరీరాన్ని చూసి హతాశురాలైంది’ అని స్టేషన్‌ పోలీస్‌ అధికారి సందీప్‌ తివారీ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి రాజ్‌కుమార్‌, అతడి సోదరులు బావు శుక్లా, రామకృష్ణ శుక్లాలను నిందితులుగా పేర్కొంటూ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవర్నీ అరెస్టు చేయలేదని, నిందితులు ముగ్గురు పారిపోయారని పోలీసులు వెల్లడించారు.

Pollution in Delhi: ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం.. రెండు రోజులు స్కూళ్లు బంద్‌