Mahakumbh: Woman dips phone in Triveni Sangam for husband's Virtual Bath on video call Watch Video

కుంభమేళాలో భర్తకు వీడియో కాల్‌ చేసి ఫోన్‌ని గంగా నదిలో ముంచిన మహిళకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మహా కుంభమేళాకు వెళ్లిన ఓ మహిళ అక్కడి నుంచి తన భర్తకు వీడియో కాల్‌ చేసింది. తన భర్తకు పవిత్ర సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన అనుభవాన్ని మిగిల్చేందుకు ప్రయత్నించిన ఆ మహిళ ఫోన్‌ను నీటిలో ముంచి తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.రేపటితో మహాకుంభమేళా (Maha Kumbh Mela) ముగియనుంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులతోపాటు ప్రముఖులు సైతం ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj)కు పోటెత్తుతున్నారు.

మహా కుంభ మేళా నదీ జలాల్లో స్థాయికి మించి మానవ, జంతు మల సంబంధమైన కోలీఫామ్‌ బ్యాక్టీరియా, స్నానాలకు కావాల్సిన ప్రమాణాలు లేవని NGTకి నివేదిక ఇచ్చిన CPCB

రేపు చివరి రోజు కావడంతో భక్తుల రద్దీని కంట్రోల్‌ చేసేందుకు అధికారులు ప్రయాగ్‌రాజ్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని ‘నో వెహికల్‌ జోన్‌’ (No Vehicle Zone)గా మారుస్తున్నామని అధికారులు ప్రకటించారు. సాయంత్రం 6 గంటలకు ప్రయాగ్‌రాజ్‌ మొత్తం ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు.

Woman Dips Phone in Sangam for Husband’s Virtual Bath

పౌష్‌ పూర్ణిమ సందర్భంగా జనవరి 13న ప్రారంభమైన ఈ మహాకుంభమేళా.. ఫిబ్రవరి 26న శివరాత్రితో ముగియనుంది. దాదాపు 45 రోజుల పాటు కుంభమేళా సాగింది. కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 64 కోట్ల మందికిపైగా భక్తులు త్రివేణీ సంగమంలో స్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్‌ ప్రకటించింది. ఇక చివరి రోజు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.