Uttar Pradesh Horror: యూపీలో దారుణం, అంబులెన్స్‌లో మహిళపై సిబ్బంది లైంగికదాడి, పక్కన భర్త కొనఊపిరితో ఉన్నా పట్టించుకోకుండా వేధింపులు

అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడే అంబులెన్స్ సిబ్బందే ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వెనుక సీట్లో భర్ ప్రాణాపాయ స్థితిలో ఉంటే ముందుసీట్లో ఆ రోగి భార్యను (Woman Molested In Ambulance) సిబ్బంది వేధించారు

Woman Molested In Ambulance, Ailing Husband Thrown Out Without Oxygen (Photo-Pixabay)

Lucknow, Sep 5: యూపీలో ఘాజీపూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడే అంబులెన్స్ సిబ్బందే ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వెనుక సీట్లో భర్ ప్రాణాపాయ స్థితిలో ఉంటే ముందుసీట్లో ఆ రోగి భార్యను (Woman Molested In Ambulance) సిబ్బంది వేధించారు. అంబులెన్స్ డ్రైవర్, అతడి సహాయకుడి వేధింపులను అడ్డుకోవడంతో నడి రోడ్డుపైనే రోగిని దించేసి (Husband Thrown Out Without Oxygen) వెళ్లిపోయారు. పోలీసులకు ఫోన్ చేసి భర్తను వేరే ఆసుపత్రికి తరలించుకునే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది.. ఆక్సిజన్ అందక ఆ పేషెంట్ ప్రాణాలు కోల్పోయాడు.

బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధార్థనగర్ కు చెందిన ఓ మహిళ ఆగస్టు 28న అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తను ఘాజిపూర్‌ లోని ఆరావాళి మార్గ్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించింది. అక్కడ చికిత్స ఖర్చులు ఎక్కువ కావడంతో వైద్యుల అనుమతితో భర్తను ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. ప్రైవేట్ అంబులెన్స్ ను మాట్లాడుకుని భర్తతో కలిసి ఇంటికి బయలుదేరింది. అప్పటికే ఆ మహిళపై కన్నేసిన అంబులెన్స్ డ్రైవర్, అతడి సహాయకుడు.. అర్ధరాత్రి ప్రయాణం కావడంతో పోలీసులు అపకుండా ఉండాలంటే ముందు కూర్చోవాలని బాధితురాలికి చెప్పారు. నిజమేనని నమ్మిన బాధితురాలు ముందు కూర్చుంది.

అత్యాచారం చేయాలంటే భయపడేలా యాంటి రేప్ బిల్, ఏకగ్రీవ ఆమోదం తెలిపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ, బిల్లు చరిత్రాత్మకమని వ్యాఖ్యానించిన దీదీ

మార్గమధ్యంలో బాధితురాలితో డ్రైవర్, అతడి సహాయకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో భయాందోళనలకు గురైన బాధితురాలు, ఆమె భర్త, సోదరుడు కేకలు వేశారు. గొడవ జరిగేలా ఉందని భావించిన డ్రైవర్.. చవానీ పోలీస్ స్టేషన్ రోడ్డులో అంబులెన్స్ ను ఆపేసి పేషెంట్ ను కిందికి దింపారు. ఆక్సిజన్ తొలగించి రోడ్డుపైనే వదిలేసి వెళ్లిపోయారు. పోతూ పోతూ బాధితురాలి దగ్గర ఉన్న రూ.10 వేలతో పాటు నగలను బలవంతంగా లాక్కుని పోయారు.

ఆక్సిజన్ అందక భర్త పరిస్థితి విషమిస్తుండడంతో ఆ మహిళ పోలీసులకు ఫోన్ చేసింది. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మరో అంబులెన్స్ ను పిలిపించి పేషెంట్ ను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి గోరఖ్ పూర్ లోని మెడికల్ కాలేజీకి తరలిస్తుండగా మార్గమాధ్యంలోనే పేషెంట్ తుదిశ్వాస వదిలాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో ఘాజీపూర్ కు చెందిన ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ పై కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif