A Girl Protesting Against Rape and Murder of Doctor at RG Kar Medical College (Photo Credits: X/@vanathadup58590)

Kolkata, Sep 3: కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న తీవ్ర విమర్శల నేపథ్యంలో మమత సర్కారు యాంటీ రేప్ బిల్లును తీసుకువచ్చింది. న్యాయ‌శాఖ మంత్రి మోలే ఘాట‌క్ అసెంబ్లీలో మంగళవారం బెంగాల్ ప్రభుత్వం హత్యాచార నిరోధక బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై సుమారు రెండున్న‌ర గంట‌ల పాటు చ‌ర్చించారు. చర్చ అనంతరం దీనికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అసెంబ్లీలో మాట్లాడారు. ఈ బిల్లు చరిత్రాత్మకమని వ్యాఖ్యానించారు.

ఆగ‌స్టు 9వ తేదీన లేడీ డాక్ట‌ర్ మృతిచెందిన త‌ర్వాత‌.. ఆ రోజే ఆమె పేరెంట్స్‌తో మాట్లాడిన‌ట్లు చెప్పారు. వాళ్ల ఇంటికి వెళ్ల‌డానికి ముందే.. ఆడియో, వీడియో, సీసీటీవీ ఫూటేజ్‌ను అంద‌జేసిన‌ట్లు చెప్పారు. ఆదివారం వ‌ర‌కు స‌మ‌యం ఇవ్వాల‌ని ఆ డాక్ట‌ర్ పేరెంట్స్‌ను కోరామ‌ని, ఒక‌వేళ దోషిని ప‌ట్టుకోకుంటే అప్పుడు కేసును సీబీఐకి అప్ప‌గిస్తామ‌ని చెప్పామ‌న్నారు.  కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ అరెస్టు, ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగంపై అదుపులోకి తీసుకున్న సీబీఐ

కానీ పోలీసులు 12 గంట‌ల లోపే నిందితుడిని పట్టుకున్నార‌ని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసును ప‌రిష్క‌రించాల‌ని పోలీసులకు చెప్పిన‌ట్లు సీఎం వెల్ల‌డించారు. కానీ కేసును సీబీఐకి అప్ప‌గించార‌ని, అందుకే సీబీఐ ఈ కేసులో న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తున్నామ‌ని, నిందితుడికి మ‌ర‌ణ‌శిక్ష విధించాల‌ని ముందు నుంచి డిమాండ్ చేస్తున్న‌ట్లు మ‌మ‌తా బెన‌ర్జీ తెలిపారు.

Here's Videos

 

ఈ రోజు మేం ప్రవేశపెట్టిన బిల్లుపై గవర్నర్ సంతకం చేయాలని విపక్షాలు అడగాలి. ఆ తర్వాత దానిని అమలు చేసే బాధ్యత మాది. ఈ బిల్లు ద్వారా కేంద్రచట్టంలోని లోపాలను సరిద్దిద్దే ప్రయత్నం చేస్తున్నాం. సత్వర విచారణ, బాధితులకు న్యాయం లభించడం ఈ బిల్లు లక్ష్యం. ఒకసారి ఈ బిల్లు పాస్‌ అయితే.. ప్రత్యేక అపరాజిత టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటుచేస్తాం. అత్యాచారం వంటి చర్యలు మానవాళికి ఒక శాపాలు. అలాంటి ఘోరాలు జరగకుండా సామాజిక సంస్కరణలు రావాలి.

యూపీ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో మహిళలపై అసాధారణ స్థాయిలో నేరాలు జరుగుతున్నాయి. ఉన్నావ్‌, హాథ్రస్‌ కేసుల్లో న్యాయం గురించి ఎవరూ మాట్లాడటం లేదు. కానీ బెంగాల్‌లో మహిళలకు కోర్టుల్లో న్యాయం లభిస్తుంది. మీవలే నేనూ ప్రధాని, హోంమంత్రిపై నినాదాలు చేస్తే ఎలా ఉంటుంది..? మహిళ రక్షణ కోసం సమర్థవంతమైన చట్టాలు తీసుకురాలేని ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేయండి’’ అని పేర్కొన్నారు.అనంతరం మృతురాలికి నివాళి అర్పించారు. హత్యాచార ఘటనపై మమత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తోన్న విపక్షాలు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చాయి.

అత్యాచార నిందితుల‌కు మ‌ర‌ణ దండ‌న విధించే రీతిలో బిల్లులో ప్ర‌తిపాద‌న‌లు చేశారు. రేప్‌, గ్యాంగ్ రేప్ కేసుల్లో నిందితుల‌కు పెరోల్‌ లేకుండా జీవిత కాల శిక్ష వేయాల‌న్న సూచ‌న కూడా చేశారు.రేపిస్టుల‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించాల‌ని ఆ బిల్లులో కోరారు.