Kolkata, September 2: కోల్‌కతాలో సంచలనం రేపిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ (Sandip Ghosh)ను సీబీఐ (CBI) సోమవారంనాడు అరెస్టు చేసింది. వైద్య కళాశాల, ఆసుపత్రిలో (RG Kar Hospital) ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగంపై ఆయనను సీబీఐ అరెస్టు చేసింది. ఘోష్ తన హయాంలో అవకవతవకలకు (Financial Irregularities) పాల్పడ్డారంటూ సీబీఐ ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు ఘోష్‌తో పాటుగా మూడు ప్రైవేటు సంస్థలపై కూడా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సీబీఐకి బెంగాల్ డాక్టర్ అత్యాచార కేసు, సీబీఐ విచారణకు ఆదేశించిన కోల్ కతా హైకోర్టు
ఆసుపత్రి సెమినార్ హాలులో ఆగస్టు 9న అత్యాచారం, హత్యకు గురైన ట్రయినీ డాక్టర్ కేసును సైతం సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి విదితమే. ఘోష్ తన హయాంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై మనీలాండరింగ్ కేసు కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ జరుపుతోంది. ఘోష్‌పై ఆరోపణల నేపథ్యంలో ఆయన సభ్యత్వాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవలే రద్దు చేసింది.