Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)

కదులుతున్న రైలులో ప్రమాదకర విన్యాసాలతో రీల్స్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్న యువతీ యువకుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది.

Dangerous Stunt On Moving Train (Credits: X)

Newdelhi, Mar 11: కదులుతున్న రైలులో (Train) ప్రమాదకర విన్యాసాలతో రీల్స్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్న యువతీ యువకుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. ఇదీ అలాంటి ఘటనే. కదులుతున్న రైలు కిటికి (Window) పట్టుకుని వేలాడుతూ ఓ యువకుడు ప్రమాదకర స్టంట్ చేశాడు. ఆ తర్వాత రైలు వేగం తగ్గాక నేలపై దిగబోయి వెనక్కి పడిపోయాడు. ఈ ఘటన యూపీలోని కాస్గంజ్, కాన్ఫూర్ స్టేషన్ల మధ్య జరిగింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ కాగా, యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, యువకుడి విన్యాసాలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటివి చేసేముందు పెంచిన తల్లిదండ్రులను ఒకసారి గుర్తుచేసుకోవాలని హితవుపలుకుతున్నారు.

తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్‌.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)

Click Below Link For Video: 

https://x.com/ChotaNewsApp/status/1899302084778053782

ముంబైలో ఇలా..

ముంబైలోని సెవ్రి రైల్వే స్టేషన్‌ లో ఆ మధ్య ఫర్హాత్ అజామ్ షేక్ అనే యువకుడు ప్రమాదకరమైన స్టంట్ చేశాడు. అతడి స్టంట్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, ఈ విన్యాసం చేసే సమయంలో ఫర్హాత్ అజామ్ షేక్ ఒక కాలు, చెయ్యి కోల్పోయాడు. ఇలాంటి సాహసాలు చేసి తనలాగా ఎవ్వరూ బాధపడొద్దని చెప్పడం తెలిసిందే.

నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement