Women Delivery on Road: డీజిల్ అయిపోవడంతో అర్ధరాత్రి ఆగిన అంబులెన్స్.. టార్చ్ లైట్ సాయంతో రోడ్డు మీదే మహిళకు ప్రసవం చేసిన స్థానిక మహిళలు, ఆరోగ్య కార్యకర్తలు.. మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాలో ఘటన.. మానవత్వాన్ని తట్టిలేపుతున్న వీడియో..

ఆస్పత్రిని చేరే మార్గం లేక రోడ్డు మీదే గర్భిణీ ప్రసవించింది. అంబులెన్స్ సిబ్బందితో పాటు దగ్గర్లోని మహిళలు ఆమెకు పురుడు పోసి మానవత్వాన్ని చూపారు. మధ్యప్రదేశ్ లో శుక్రవారం నాడు ఈ ఘటన చోటుచేసుకుంది.

Credits: Twitter

Bhopal, October 30: నిండు గర్భిణిని ఆసుపత్రికి (Hospital) తీసుకెళుతున్న ఓ అంబులెన్స్ డీజిల్ కొరతతో (Fuel Shortage) మధ్యలోనే ఆగిపోయింది. ఆస్పత్రిని చేరే మార్గం లేక రోడ్డు మీదే (On the roadside) గర్భిణీ ప్రసవించింది. అంబులెన్స్ సిబ్బందితో పాటు దగ్గర్లోని మహిళలు ఆమెకు పురుడు పోసి మానవత్వాన్ని (Humanity) చూపారు. మధ్యప్రదేశ్ లో శుక్రవారం నాడు ఈ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని పన్నా జిల్లా బనౌలీలోని షానగర్ కు చెందిన రేష్మా నిండు గర్భిణీ.. శుక్రవారం రాత్రి నొప్పులు మొదలవడంతో ఇంట్లో వాళ్లు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. ఫోన్ చేసిన కొద్దిసేపటికి అంబులెన్స్ వచ్చింది. అందులో వచ్చిన ఆరోగ్య కార్యకర్తలు రేష్మను పరీక్షించి కాన్పు జరగొచ్చని తెలిపారు. దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించేందుకు అంబులెన్స్ లో బయల్దేరారు.

ఈ పాత్ర రెండువేల ఏళ్ల నాటిది.. బాన్సువాడలో బయటపడింది.. బోర్లాం గ్రామంలో మట్టి దిబ్బపై లభ్యం.. ప్రాకృత భాష, బ్రహ్మీలిపిలో లఘుశాసనం.. శాతవాహన కాలం నాటి చారిత్రక అవశేషంగా గుర్తింపు

అయితే, డీజిల్ అయిపోవడంతో అంబులెన్స్ మార్గమధ్యంలోనే ఆగిపోయింది. రేష్మ ఏ క్షణంలోనైనా ప్రసవించే పరిస్థితిలో ఉండడంతో మరో మార్గంలేక నడిరోడ్డు మీద, చీకట్లోనే ఆరోగ్య కార్యకర్తలు ప్రసవం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.