Poonam Pandey At Maha Kumbh: త్రివేణీ సంగంమంలో పుణ్య స్నానంతో నా పాపాలన్నీ కొట్టుకుపోయాయి, మహా కుంభమేళాలో హీరోయిన్ పూనమ్ పాండే వీడియో ఇదిగో..
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన మహా కుంభమేళా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది.తాజాగా హీరోయిన్ పూనమ్ పాండే కుంభమేళాలో పాల్గొని స్నానం ఆచరించింది. అనంతరం ఆమె అక్కడి ఫొటోలను షేర్ చేస్తూ.. ‘‘నా పాపాలన్నీ కొట్టుకుపోయాయి. జీవితాన్ని దగ్గరగా చూశాను.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన మహా కుంభమేళా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది.తాజాగా హీరోయిన్ పూనమ్ పాండే కుంభమేళాలో పాల్గొని స్నానం ఆచరించింది. అనంతరం ఆమె అక్కడి ఫొటోలను షేర్ చేస్తూ.. ‘‘నా పాపాలన్నీ కొట్టుకుపోయాయి. జీవితాన్ని దగ్గరగా చూశాను. అక్కడ 70 ఏళ్ల వృద్ధుడు చెప్పులు లేకుండా గంటల తరబడి నడుస్తాడు. ఇక్కడ విశ్వాసానికి హద్దులు లేవు. కుంభమేళాలో తమ ప్రాణాలను కోల్పోయిన వారికి మోక్షం దొరుకుతుందని ఆశిస్తున్నాను. ఇక్కడి భక్తి నన్ను మూగబోయేలా చేసింది’’ అని రాసుకొచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ఘనంగా కొనసాగుతోంది. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు (holy dip) ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు.ఇప్పటి వరకూ ఈ కుంభమేళాలో గురువారం నాటికే 30 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించినట్లు యూపీ అధికారులు తాజాగా వెల్లడించారు.
Poonam Pandey At Maha Kumbh